ఒకప్పుడు స్టార్ హీరోలతో సక్సెస్ ఫుల్ మూవీస్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనవాసరావు కొంత కాలంగా సీనీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.  పుష్పకవిమానం, ఆదిత్య 369 వంటి ఎన్నో వినూత్న మూవీలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు.  వృద్ధాప్యం కారణంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు ప్రముఖ కన్నడ సంగీత కళాకారిణి నాగరత్నమ్మ జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. బెంగుళూరు నాగరత్నమ్మ తెలుగు సంగీత, సాహిత్యాలకు సేవలందించిన కన్నడ విదుషీమణి. దేవదాసి కుటుంబానికి చెందిన ఆమె ఆనాటి సామాజిక వ్యవస్థలో తీవ్రమైన సంఘర్షణకు గురయ్యారు. అయినా పరిస్థితులకు ఎదురు నిలిచారు. అకుంఠిత దీక్షతో ముద్దుపళని ‘రాధికా సాంత్వనం’ కావ్యాన్ని, త్యాగరాయ సమాధి మందిరాన్ని ప్రపంచానికి కానుకగా అందించారు. అలా తెలుగువారికి చిరస్మరణీయురాలయ్యారు. 

 

చిన్నతనంలో పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, దేవదాసీగా జీవితాన్ని ప్రారంభించి, సమాజంలో అవమానాలు పడి, ఆపై సంగీత కళాకారిణిగా జగద్వితమైన ఖ్యాతిని గడించిన నాగరత్నమ్మ జీవితంలో సినిమాకు కావాల్సిన అన్ని రసాలూ ఉన్నాయని గమనించిన సింగీతం, ఆమె జీవితాన్ని సినిమా రూపంలో తీయాలని భావించారు.  ఒక మహిళ, అందులో దేవదాసి కావడమే నాటి పండితుల తిరస్కారానికి కారణంగా భావించారు నాగరత్నమ్మ. అంతేకాదు దీన్ని ఒకరకంగా ముద్దుపళనిని అవమానించడమే అనుకుంది.  కన్నడ మాతృభాషగా కలిగిన నాగరత్నమ్మ తెలుగు సాహిత్య చరిత్రలో విస్మృతికి గురైన ముద్దుపళనికి చిరకీర్తిని సంపాదించి పెట్టింది.

 

తన కృతులతో దక్షిణాదిన తెలుగుభాషకు అమృతం అద్ది అజరామరం చేసిన నాదబ్రహ్మ త్యాగయ్య దివ్యస్మృతికి తన జీవితాన్ని అంకితం చేశారామె. అలా తెలుగుపట్ల అభిమానాన్ని పెంచుకుంది. కాగా, తొలుత ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని సింగీతం భావించారట. అయితే, ఇప్పుడు తాజాగా సమంత పేరు వినిపిస్తోంది.  ప్రస్తుతం వీరిద్దరూ లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: