మెగా హీరోలందరికీ సక్సెస్ రేటు చాలా ఎక్కువ. టాలీవుడ్ లో ఉన్న అందరు వారసుల కన్నా మెగా హీరోల సక్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. మెగా ఫ్యామిలీలో దాదాపు పదికి పైగా హీరోలు ఉన్నా కూడా విజయాలు సాధిస్తూనే ఉన్నారు. అయితే మెగా హీరోలందరిలో వరుణ్ తేజ్ చాలా ప్రత్యేకం. తన మొదటి సినిమా ముకుంద నుండి గమనిస్తే వరుణ్ ఎంచుకునే సబ్జెక్టులు చాలా కొత్తగా ఉంటున్నాయి. కమర్షియల్ ఫార్ములాకి వెళ్ళకుండా తనకు నచ్చిన వాటిని మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నాడు.

 

ఈ క్రమంలో హిట్లు కూడా అందుకుంటున్నాడు. వైవిధ్యమైన చిత్రాలను చేయడమే కాకుండా ఫిదా లాంటి హీరోయిన్ కే ప్రాధాన్యమున్న చిత్రాన్ని ఒప్పుకోవడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న గద్దలకొండ గణేష్ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం వరుణ్తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా చేస్తున్నాడు.

 

కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాక్సర్ గా వరుణ్ కనిపిస్తున్నాడు. అంతరిక్షం చేసే టైమ్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న కిరణ్ వరుణ్ కి ఈ కథ చెప్పి ఒప్పించాడట. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోనున్నారట.

 


ఇద్దరు హీరోయిన్లు అవసరమైన ఈ కథకి ఒకరిని కొత్తవారిని తీసుకోగా మరొకరిని లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అంతరిక్షం, మిస్టర్ వంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ లావణ్యని తీసుకుంటే వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ చిత్రం అవుతుంది. ఇంతకుముందు చేసిన రెండు చిత్రాలు విజయాలు సాధించలేకపోయాయి. మరి ఈ సినిమానైనా విజయం అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: