భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.   కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం, 920 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు.  లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క అల్లాడిపోతున్న వారికి బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ అండగా నిలిచాడు. రోజూ సాయంత్రం కొంతసేపైనా మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వాన్ని కోరాడు. తన విజ్ఞప్తిని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరాడు.  అయితే దేశ వ్యాప్తంగా మద్యానికి అలవాటు పడిన వారు ఇప్పుడు ఇది కొంత మందిని ఉన్మాదులుగా మారుస్తుంది. 

 

తెలంగాణలో కల్లు కోసం ఓ మహిళ పిచ్చిపట్టినదానిలా ప్రవర్తించి పినాయిల్ తాగినట్లు వార్తలు వచ్చాయి.  అయితే కొంత మంది ఉన్మాదులుగా మారుతున్న సమయంలో ప్రభుత్వాన్ని నటుడు రిషికపూర్ చేసిన విజ్క్షప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారు అనిశ్చితి, నిరాశలో మునిగి ఉంటారని, ఇలాంటి సమయంలో వారికి మద్యం అవసరం చాలా ఉంటుందని రిషికపూర్ అభిప్రాయపడ్డాడు. కాబట్టి బ్లాక్‌లో అయినా అమ్మితేనే బాగుంటుందని ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరాడు. 

 

అయితే భారత్ లో మాత్రం కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి పట్టున ఉండాలని అందరూ అంటున్నారు.  దాంతో కొంత మంది తాగుబోతులు కష్టాలు పడుతున్నట్లు సమాచారం. అయితే రిషికపూర్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభించింది. నటుడి అభిప్రాయంతో ఏకీభవిస్తూ కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహంతో ఉన్న వారికి నీళ్లు ఎంత అవసరమో, మద్యం బాబులకు మందు కూడా అంతే అవసరమంటూ భావాత్మక పోస్టులతో నింపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: