డబ్బు సంపాదన విషయంలో సరైన దృక్పదం కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలుగుతాడు. జీవిత అవసరాలకు డబ్బు కావాలి కాని ఆ డబ్బు మాత్రమే జీవితం అని భావించే వాడు నిజమైన ధనవంతుడు కాలేడు. కేవలం డబ్బుతో కొనలేని వస్తువులు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.


డబ్బుతో పుస్తకాలను కొనగలం కానీ విజ్ఞాన్ని కొనలేము. ఆభరణాలను కొనగలం కాని సౌందర్యాన్ని పెంపొందించుకోలేము. అదేవిధంగా ఖరీదైన గడియారాలు కొనుక్కోగలం కాని గడిచిపోయిన కాలాన్ని తిరిగి పొందలేము. ఇలా జీవితంలో డబ్బు సంపాదించే విషయంలో అనేక సమస్యలు మనకు ఎదురౌతు మన ఆనందం ఆవిరి అయిపోతు ఉంటుంది.


అయితే ఇలాంటి సమస్యలకు బెదరకుండా తాను చేసే పనిని ఒక ఔషదంగా అన్నిటా మించి ఒక యాగంగా భావించి కృషి చేసిన వ్యక్తికి మాత్రమే సంపద లభిస్తుంది. ఈమధ్య ఒక ప్రముఖ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఎక్కువగా తీరిక సమయంతో కాలం గడిపే వ్యక్తులకన్నా నిరంతరం పనుల ఒత్తిడితో పరుగులు తీసేవారే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటున్నారు అంటూ ఆ నివేదిక తెలియచేస్తోంది.


మరొక మాటలో చెప్పాలి అంటే ప్రతిరోజు ఎదో ఒక పని కలిగి ఉండేవాడు అదృష్టవంతుడు. ఏ పని లేకుండా ఖాళీగా గడిపే వాడు దురదృష్టవంతుడు. అందుకే చేసే పనిని ఇష్టంగా చేసేవారి జీవితంలో ఆనందంతో పాటు ఐశ్వర్యం తాండవిస్తుంది అని అంటారు. ఇలాంటి వ్యక్తులలో అలసట కూడ కనిపించదు. అయితే ఒక వ్యక్తి సంపద సాధించాలి అన్న దృష్టితో ఒక యాగంగా చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దృష్టి అంతా అతడు చేసే పనిమీద మాత్రమే పెట్టాలి అలాంటి వ్యక్తులను లక్ష్మి వరిస్తుంది అని అంటారు. నీరు ఎల్లప్పుడు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో మనిషి జీవించి ఉన్నంత కాలం ఎదోఒక పనిచేస్తూ ఉండకపోతే అనుకున్న ధ్యేయాన్ని చేరుకోలేడు. అందుకే శ్రమ సౌందర్యం తెలిసినాడు మాత్రమే సంపన్నుడు కాగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి: