ఎప్పుడూ క‌ళక‌ళ‌లాడుతూ హ‌డావిడిగా ఉండే సినీ ప్ర‌పంచం అంతా ఒక్క‌సారిగా డ‌ల్ అయిపోయింది. ఈ లాక్‌డౌన్ అనేది టాలీవుడ్‌కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సినిమా షూటింగ్‌ల‌న్నీ కూడా ఎక్క‌డివ‌క్క‌డ ఆగిపోయాయి. సినిమా రంగంలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా ఎఫెక్ట్ మాములుగా లేద‌నే చెప్పాలి. ఇక టాలీవుడ్ మీద ఆధారపడిన వారి సంగతి పక్కన పెడితే నిర్మాణ సంస్థంలో అతి పెద్ద దెబ్బ ముఖ్యంగా దిల్‌ రాజుకే తగిలినట్లు కనిపిస్తోంది. అందుకు కార‌ణమేమిటంటే... నిర్మాతగా ఆయన `వి` సినిమా విడుదలకు రెడీ గా వుంది. దాదాపు నలభై కోట్ల బెట్. అంతే కాక  వకీల్ సాబ్ నిర్మాణంలో వుంది. ఇక అది కూడా షూటింగ్ ఆగిపోయింది.  ఇప్పటికే దాని మీద అన్నీ కలిపి ముఫై కోట్ల వరకు పెట్టేసారని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇంకో పక్క 15 కోట్ల రూపాయిలు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ కు అడ్వాన్స్ గా చెల్లించారు.

 

ఇక వి సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.  థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అంద‌రూ ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఓవర్ సీస్ లో థియేటర్లు కనీసం మరో మూడు నెలల వరకు తెరుచుకోవు అని వినిపిస్తోంది. ఇక వకీల్ సాబ్ ప‌రిస్థితి ఏంటో అర్ధం కావ‌డం లేదు.  సినిమా వర్క్ ఇంకా కనీసం 40 రోజులు వుంది. ఇండస్ట్రీ ప‌రిస్థితులు ఏమీ అర్ధం కావ‌డం లేదు.

 

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సంగతి అలా వుంచితే  ఒక ఎగ్జిబిటర్ గా దిల్ రాజుకు ముఫై థియేటర్ల వరకు చేతిలో వున్నాయి. చాలా వరకు గ్రౌండ్ లీజులో వున్నవే. ప్ర‌స్తుతం ఆయ‌న ఏ ఆదాయం లేక‌పోయిన‌ప్ప‌టికీ జీతాలు మాత్రం ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. ఇదంతా అనుకోని న‌ష్ట‌మ‌నే చెప్పాలి.

 

మ‌రో పెద్ద నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేష‌న్స్‌. వీళ్ళు ప్ర‌స్తుతం రెండు హిట్ లు కొట్టి వున్నారు. సినిమాలు ఏవీ నిర్మాణంలో పెద్దగా లేవు. నితిన్ రంగ్ దే మాత్రమే సెట్ మీద వుంది. పెద్ద బడ్జెట్ కాదు. ఇక మైత్రీ విష‌యానికి వ‌స్తే ఉప్పెన మీద మాత్రమే పెట్టుబడి పెట్టారు. మరే సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. అన్నీ కూడా టాక్స్‌లో ఉన్నాయి. 

 

గీతా లో అఖిల్ సినిమా బ్యాచులర్ ఒక్కటే సెట్ మీద వుంది. అదీ మరీ అంత హై బడ్జెట్ కాదు. భోగవిల్లి ప్రసాద్ సోలో బతుకే సోబెటర్ మూడు వంతలు పూర్తయింది. ఆయనకు అది కాస్త ఇబ్బందే. ఇక అన్నపూర్ణలో సినిమాలు ఏవీ లేవు. సురేష్ లో నారప్ప ఒక్కటే ఆగింది. ఇలా దాదాపుగా ఇండస్ట్రీలో నిర్మాతలు ఎవ్వరికీ మరీ భయంకరమైన బర్డెన్ లేద‌నే చెప్పాలి. ఒక్క దిల్‌రాజు మాత్ర‌మే కాస్త టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌రిస్థితి మిగ‌తావారంతా దాదాపు సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్లే. దురాసే దు:ఖానికి చేటు అని జ‌నాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: