కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవ్వడంతో జనాలు అందరు ఇంటికే పరిమితమైయ్యారు. ఒక్కవేళా ఇంటి నుండి బయటికి వద్దాం అనుకుంటే బయట పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఈ కారణం లేకుండా బయటికి వచ్చిన వారికీ లాఠీ వాతం రుచి చూపించి పంపిస్తున్నారు.

 

ప్రస్తుతం ప్రజలందరు ఇంటికే పరిమితమైయ్యారు.  ఇంట్లోనే ఉంటూ వారి పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొంత మంది ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నారు. మరి కొందరు టీవీతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంట్లో ఉంటూ బోర్ గా ఫీల్ అవుతున్న వారికీ రామ్ గోపాల్ వర్మ మంచి అవకాశాన్ని కల్పించారు. అది ఎంట అని ఆలోచిస్తున్నారా...? అదేనండి రామ్ గోపాల్ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో పెట్టారంటా. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

 

 

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎన్ని వివాదాల మధ్య తీశారో అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్‌ అయ్యిందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తాజా ఘటనలతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు చిత్రీకరించారు. ఈ సినిమా చిత్రీకరణలో టీడీపీ వారు వర్మపై తీవ్ర విమర్శలు గుప్పరు. 

 

సినిమా చిత్రీకరణ మొదలు నుండి సినిమా టైటిల్ ఖరారు చేసే వరకు అన్ని వివాదాలను ఎదుర్కొంది. ఈ సినిమాకు మొదట్లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ చివరకు ఈ సినిమాకు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని చేంజ్ చేశారు. తాజాగా వర్మ మరోసారి చంద్రబాబును లోకేష్‌ను ఆ సినిమా చూడాలంటూ ట్వీట్ చేశాడు. మరోసారి అమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: