కన్న బిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లి దృష్టిలో పసివారే.. అందుకే వారిని ఏరా అని ప్రేమగా పిలుస్తారు.. ఇకపోతే అంతటి చనువు ఒక స్నేహితునికే ఉంటుంది.. కన్న బిడ్దను ప్రేమించడంలో తల్లి ప్రేమ కనపడితే.. తన ప్రాణ స్నేహితుని ఎదుగుదలలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు నిజమైన స్నేహితుడు.. ఇలాంటి వారు లోకంలో చాలా అరుదు అని చెప్పవచ్చూ.. ఇక చిత్రపరిశ్రమలో తమ ప్రస్దానాన్ని కలిసి మొదలుపెట్టిన వారు.. ఒక స్దాయికి వచ్చాక వారి మధ్య ఎంత చనువు ఉన్న ఏరా అనే పదాన్ని మాత్రం వాడరు.. ఒకవేళ అలా పిలుచుకున్నారంటే వారి మధ్య స్నేహబంధం ఏ స్దాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చూ..

 

 

ఇకపోతే టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న ముఖ్య స్దంభాలలో చిరంజీవిగారు ఒకరు.. ఇప్పటి వరకు ఆయనను ఏరా అని పిలిచిన వారు మనకు కనిపించి ఉండకపోవచ్చూ.. తెరవెనక అంటారు కావచ్చూ కానీ అందరి ముందు నేను చిరంజీవిని ఇలా అంటానని మాత్రం ఎవరు దాదాపుగా చెప్పలేదు.. కానీ ఇప్పుడు ఒక సీనియర్ నటుడు.. మాత్రం నేను చిరంజీవిని ఏరా అంటా అతను కూడా నన్ను ఏరా అంటాడని తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు.. అతనే భాను చందర్.. 80 నాటి హీరోల్లో ఒకరైన ఇతను మెగాస్టార్ చిరంజీవికి మంచి మిత్రుడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదేంటో తెలుసుకుంటే..

 

 

చిరంజీవి గారు నేను మన ఊరి పాండవులు మూవీ షూటింగ్‌ టైంలో ఒకే రూంలో ఉన్నాం. అసలు వాడే నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయడం నేర్పించాడు దోయకాయల పల్లిలో. రేయ్.. నీకు బైక్ తోలడం వచ్చా? అని అడిగాడు.. నాకు టూ వీలర్ రాదురా.. కారు తోలుతా అంటే.. రారా అని ఆ దగ్గర్లో అతనికి తెలిసిన ఆయన బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించాడు. అంతే కాదు ఇన్నేళ్ల మా సినీ ప్రస్దానంలో చిరంజీవి స్దాయి ఏంటో అందరికి తెలుసు.. అయినా వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పులేదు. అప్పుడు ఏరా ఏరా అనుకున్నాం ఇప్పుడు ఏరా ఏరా అనుకుంటాం. వాడు చాలా సరదా మనిషి. దాన్ని గురించి చెప్పడం కంటే అనుభవిస్తే చాలా బాగుంటుంది. అంటూ భాను చందర్ చిరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: