కరోనా వైరస్ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం షట్ డౌన్ దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకు రావడంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దేశంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు, రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంట్లో చాలా మంది ప్రముఖులు మరియు హీరోలు అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రభుత్వాలకు అండగా నిలబడటానికి ప్రజల అవసరాలు తీర్చడానికి తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశంలో ఉన్న కొందరు ఐశ్వర్యవంతులు అయితే వైరస్ బాధితుల కోసం హాస్పిటల్స్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. మరికొంతమంది వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రభుత్వాలకు కొన్ని వందల కోట్లు విరాళాలు ప్రకటించడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలు కూడా డొనేషన్ లు ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల కు చెరో 50 లక్షలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి కోటి, రెండు తెలుగు రాష్ట్రాల కు చెరో 50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే నితిన్ మరియు కొంతమంది సినిమా డైరెక్టర్లు తమ వంతుగా డబ్బులను విరాళాలుగా ప్రభుత్వాలకు ప్రకటించడం జరిగింది.

 

అయితే ఇటువంటి సమయంలో బుల్లితెరపై యాంకరింగ్ గా రాణించిన ప్రదీప్ చాలా వినూత్నంగా తన దయాగుణాన్ని బయటపెట్టారు. మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ వల్ల చాలామంది మధ్యతరగతి మరియు పేద వర్గాల ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో..పనులు లేకపోవడంతో వాళ్ల కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులు మరియు కొంత తన వంతు ధనసహాయం చేశారట. ఇలా దాదాపు తన చుట్టుపక్కల ఉన్న 60 కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని ప్రదీప్ ఈ విధంగా చేయటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు చేతులెత్తి దండం పెడుతూ...ఇదే అసలైన సిసలైన హెల్ప్ అంటే. సూపర్ భయ్యా నువ్వు అని పొగుడుతున్నారు. ఇతనిలాగా అందరూ హీరోలూ చేస్తే డొనేషన్ లు కూడా అక్కర్లేదు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: