టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి సెలెక్టడ్ మూవీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. అందుకే ఈ అమ్మడి ఖాతాలో ఎక్కువగా హిట్ సినిమాలు ఉంటూంటాయి. నటనతోపాటు డ్యాన్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉన్న సాయి పల్లవి తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటిస్తోంది. మళయాళ ప్రేమమ్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. తెలుగులో ఫిదాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి పల్లవి తన లైఫ్ సీక్రెట్స్ కొన్నింటిని చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించేందుకు తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నాను కాబట్టే సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నట్టు చెప్తోంది.  

 

 

తాను తమిళనాడులోని కోటగిరి ప్రాంతంలోని బడగ సామాజిక వర్గమని చెప్పుకొచ్చింది. వీరి మాట్లాడే భాషకు లిపి కూడా లేదట. కోయంబత్తూరుకు సమీపంలోని ప్రాంతమే కోటగిరి. తన చదువు కూడా కోయంబత్తూరులోనే జరిగింది. స్టూడెంట్ గా ఉన్నప్పుడు తమిళ హీరో సూర్యకు అభిమానిగా ఉండి సినిమాల్లోకి వచ్చాక సూర్యతో సినిమా చేయడం సంతోషాన్నిచ్చిందట. ఫిదా సినిమా కోసమే ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నానని కొత్త విషయాలు నేర్చుకోవడంపై తనకు ఆసక్తి ఎక్కువని చెప్పింది. మాధురిదీక్షిత్, ఐశ్వర్యారాయ్ డ్యాన్సులంటే ఇష్టం కాబట్టే తనకు డ్యాన్సు పట్ల మక్కువ ఏర్పడిందని చెప్పింది.

 

 

ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది సాయిపల్లవి. తెలుగు సినిమాల్లోకి తనను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఈ సినిమా చేస్తోంది. దీంతో పాటు రానా హీరోగా రాబోతున్న విరాటపర్వం సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే సంపాదించింది. రౌడీ బేబీ పాటలో సాయి పల్లవి డ్యాన్స్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: