కరోనా వైరస్ వల్ల సమాజంలో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు జీవన ఉపాధి లేక కుటుంబాలను నెట్టుకు రావటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలను భార్యని పోషించలేక మరోపక్క ఉద్యోగానికి వెళ్లలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు సహాయం కొంతమేర బాగానే ఉన్నా గాని అది కొద్ది రోజులకే సరి పోవడంతో సామాన్య కుటుంబాలలో చెయ్యి చాచే పరిస్థితి ఏర్పడింది. అయితే సామాన్య ప్రజల కష్టాలు ఇలా ఉంటే సెలబ్రిటీల కష్టాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. సెలబ్రిటీలు ఎప్పుడూ తమ శరీర సుఖం కోసం ఆలోచిస్తూ..కొంచెం కూడా అందం నలగకుండా ఉండాలి అని ఇంటిలో 10 నుంచి 12 మంది వరకు పనిమనుషులతో పనిచేపిస్తూ ప్రతిదానికి ఓ అసిస్టెంట్ నియమిస్తూ వాళ్లకి జీతాలు ఇస్తూ వాళ్ల సొంత పనులు వాళ్ళతో చేయించుకునేవారు.

 

అదే సమయంలో పార్టీలు, విందులు, వినోదాలు అంటూ బయట బాగా ఎంజాయ్ చేస్తూ తీరిగ్గా ఇంటికి వచ్చే వాళ్ళు. అయితే కరోనా వైరస్ పుణ్యమా అని సామాన్యులు మరియు సెలబ్రిటీలు అని తేడా లేకుండా ఎవరికి వారిని ఇంటికి పరిమితం అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న వైరస్ ప్రపంచవ్యాప్తంగా మనుషులు అంత ఒక్కటే అని రుజువు చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియాలో షట్ డౌన్ అయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రవాణా మరియు అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇటువంటి తరుణంలో మన సెలబ్రెటీలు ఇంటికి పరిమితం కావడంతో వాళ్ళు చేస్తున్న పనుల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సూపర్ మార్కెట్ కి వచ్చి షాపింగ్ చేశాడు. పని మనుషులంతా ఇళ్లకే పరిమితం కావడంతో చేసేదేం లేక బన్నీ తన ఇంటికి దగ్గరగా ఉన్న షాపింగ్ మాల్ కు వెళ్లాడు. ముఖానికి మాస్క్ వేసుకొని ఇంటికి కావాల్సిన సరుకులు కొన్నాడు. ఇంకా కొంతమంది హీరోలు కూడా ఇదే విధంగా బయట సూపర్ మార్కెట్లలో సరుకులు కొంటున్నారు. కొంతమంది గార్డెనింగ్ చేస్తు వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. హీరోయిన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎవరి ఇంట్లో వాళ్లు లాక్ డౌన్ లో ఉన్నారు. హీరోయిన్ కత్రినా అయితే ఇంట్లో గిన్నెలు తోముతోంది. తన గదిని తానే శుభ్రం చేసుకుంటోంది. చెల్లెలు, అమ్మకు తనే వండి పెడుతోంది. ఓ హీరోయిన్ లా కాకుండా.. సగటు అమ్మాయిలా అన్ని పనులు చేసుకుంటోంది. ముఖానికి మేకప్ లేకపోవడంతో ఒక ఆడపిల్ల లాగా ఇంటిలో బతుకుతున్నారు హీరోయిన్లు. కమెడియన్ ఆలీ అయితే మా ఆవిడ ఏది చెబితే ఆ పని చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ పుణ్యమా అలా ఉన్నాయి సెలబ్రిటీల కష్టాలు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: