టాలీవుడ్ యంగ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా 2018 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమాలో చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తన అత్యద్భుత నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే ఇప్పటికీ మరచిపోలేము అనే చెప్పాలి. 

 

పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా హీరోయిన్ సమంత వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు ప్రెసిడెంట్ గా జగపతి బాబు, అలానే రాజకీయ నాయకుడిగా కన్నింగ్ విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, హీరో తల్లి దండ్రులుగా నటించిన సీనియర్ నరేష్, రోహిణి, ఇక అందరికంటే ముఖ్యంగా హీరోకి అన్నగా నటించిన యువ నటుడు ఆది పినిశెట్టి నటన కూడా సూపర్బ్ అని చెప్పాలి. సరిగ్గా సమ్మర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలిరోజు తొలిఆట నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో పాటు అప్పట్లో ఈ సినిమా నెలకొల్పిన పలు రికార్డ్స్ ఇప్పటికీ చాలా చోట్ల అలానే పదిలంగా ఉన్నాయి అంటే, రంగస్థలం ఎంత గొప్ప విజయాన్ని అందుకుందో చెప్పుకోవచ్చు. 

 

రంగస్థలం అనే ఊరిలో రాజకీయాల నేపథ్యంలో ఆధిపత్య పోరు కోసం జరిగే కథలో, ఎక్కడా కథను ప్రక్క దారి పట్టించకుండా దర్శకుడు సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ అయితే అమోఘం అంటూ ప్రేక్షకులు అప్పట్లో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక నేటితో ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రెండేళ్లు గడవడంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, దీనిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ట్రెండ్ గా పరిగెత్తిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా కానీ, లేదా పాటలు కానీ ఎక్కడ ప్రదర్శితమైనా, ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన రావడం జరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే రామ్ చరణ్ మొత్తం సినిమా కెరీర్ లో రంగస్థలం ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రరాజం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: