సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ చేసిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో మిర్చి నుంచి మహేష్ బాబు తో తీసిన భరత్ అనే నేను సినిమా వరకు అన్ని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లను సాధించినవే. దాంతో మెగాస్టార్ కొరటాల అనగానే ఆసక్తి చూపించి కథ విన్నారు. అంతే ఆ కథ నచ్చి వెంటనే కొరటాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకోసం కొరటాల దాదాపు రెండేళ్ళు వేయిట్ చేశాడు. ఈ రెండేళ్ళలో మరో రెండు సినిమాలని కంప్లీట్ చేసి ఉండేవాడు. కాని మెగాస్టార్ తో సినిమా అంటే ఎన్ని రోజులైనా ఆగాల్సిందే అన్న పట్టుదలతో వేరే సినిమా కమిటవ్వలేదు.

 

ఇక మెగాస్టార్ చిరంజీవి తో సినిమా మెదలు పెట్టి ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఆచార్య అన్న టైటిల్ తో చిత్రం ఫస్ట్ లుక్ ను ఉగాది కానుకగా విడుదల చేయాలని ముందు కొరటాల అనుకున్నారు. కాని టైటిల్ ను చిరంజీవి ప్రకటించేశారు. దాంతో ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను ఉగాదికి విడుదల చేస్తారంటూ చాలా మంది ప్రచారం చేశారు. కాని ఉగాదికి ఆర్.ఆర్.ఆర్ హడావుడి ఉంటుందని ఆ వెంటనే చరణ్ బర్త్ డేకు రామరాజు వీడియోను విడుదల చేశారు. దాంతో కొరటాల ఆచార్య ఫస్ట్ లుక్ ను వాయిదా వేశారట. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఆచార్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ఇప్పుడు చిరంజీవి తో పాటు కొరటాల బృందం ఆనుకుంటున్నారట. 

 

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 2వ తారీకున శ్రీరామ నవమికి ఆచార్య నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుండగా కీలక పాత్రలో చరణ్ నటించబోతున్నాడు. ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటించబోతుంది. ఇక సినిమా షూటింగ్స్ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆచార్య షూటింగ్ మళ్లీ మే లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇక ఆచార్య సినిమా రిలీజ్ కూడా వాయిదా పడటం ఖాయం అంటున్నారు. ఏ విషయమైనా శ్రీరామ నవమికి తెలిసే అవకాశముందట. అయితే ఇది ఫిక్సైనట్టేనా లేదా మళ్ళీ తిస్సుమనిపిస్తారా అంటూ కొందరు అనుమానాలని వ్యక్తం చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: