ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లో వరుసగా సినిమాలు చేస్తూ సక్సస్ లు అందుకుంటున్న వాళ్ళలో అందరికంటే ముందు త్రివిక్రమ్ - సుకుమార్ ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి సక్సస్ ని సొంతం చేసుకున్నాడు. నా పేరు సూర్య ఫ్లాప్ తో కాస్త డల్ అయిన బన్నీ కి మంచి ఊపునిచ్చాడు. ఇక సుకుమార్ పోయిన సంవత్సరం 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ సక్సస్ ని సొంతం చేసుకొని ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి త్రివిక్రమ్ శ్రీనివాస్ పంథా వేరు సుకుమార్ పంథా వేరు. ఇద్దరి రూటు వేరయినపటికి సక్సస్ లు మాత్రం ఇద్దరికి దక్కుతున్నాయి. అయితే ఇప్పుడు సుకుమార్ సడన్ గా రూటు మార్చి త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నాడని తాజాగా న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది.

 

లెక్కల మాస్టారు సుకుమార్ తన సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నాడట. ఇందులో కాస్త బన్నీ సూచన కూడా ఉందని సమాచారం. త్రివిక్రమ్ తన మొదటి సినిమా నుండి సాఫ్ట్ టైటిళ్లతో - లేడీ నేమ్ తో స్టార్ట్ అయ్యే టైటిళ్లతో సినిమాలు తీస్తున్నాడు. అంతే కాదు 'అ' సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. నువ్వే నువ్వే - అరవింద సమేత - అ ఆ (అనసూయ రామలింగం వ్స్ ఆనంద్ విహారి) సినిమా టైటిళ్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. మరోవైపు సుకుమార్ ఫస్ట్ సినిమా నుండి డిఫరెంట్ టైటిళ్లతో సకస్ లను అందుకుంటున్నాడు.

 

కానీ ఇప్పుడు సుకుమార్ తన నెక్స్ట్ సినిమా కోసం రూట్ మార్చి కోసం త్రివిక్రమ్ పెడుతున్నట్టుగా తను తెరకెక్కించబోయో సినిమాలకి టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం అక్కు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న సినిమా కోసం లేడీ ఓరియెంటెడ్ టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ఫీమేల్ ఓరియొంటెడ్ టైటిల్స్ ని అనుకున్నాడట. వాటిలో బెస్ట్ నేమ్ ఫైనలైజ్ చేసి... దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే సుకుమార్ అండ్ టీమ్ ఈ టైటిల్ ను అనౌన్స్ చేయాలని సన్నాహాల్లో ఉన్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సుకుమార్ కి బాగా అచ్చొచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీ సంగీతాన్ని అందిన్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: