మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇండస్ట్రీ వర్గాలు కూడా చిరంజీవి సినిమా కోసం ఎంతో ఇంటరెస్టింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక చేసిన ఖైదీ నెంబర్ 150, సైరా.. నరసింహారెడ్డి సినిమాలు చెరి 100కోట్ల షేర్ సాధించడమే ఈ క్యూరియాసిటీకి కారణం. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ మూవీగా ఆచార్య సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఓ లేటెస్ట్ అప్డేట్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

 

 

సినిమా ఫస్ట్ లుక్ ను శ్రీరామనవమి పండగ సందర్భంగా వచ్చే ఏప్రిల్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతోందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో బాగా హల్ చల్ చేస్తోంది. నిజానికి సినిమా టైటిల్ కూడా అదే రోజున రివీల్ చేయాల్సి ఉన్నా.. చిరంజీవే స్వయంగా ఈ టైటిల్ ను చెప్పేయడంతో టైటిల్ సస్పెన్స్ వీడిపోయింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రమే మిగిలింది. ఈరోజుల్లో ఓ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అంటే దాదాపు సినిమా రిలీజ్ లాంటి విషయమే. కాబట్టి ఆచార్య ఫస్ట్ లుక్ ను శ్రీరామనవమి శుభదినాన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

ఇటివల ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్, రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రామరాజుగా చరణ్ లుక్ రివీల్ అయ్యాయి. కాబట్టి సమీపంలో ఉంది శ్రీరామనవమి పండగ మాత్రమే. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనేది టీమ్ ఆలోచనగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్త వైరల్ గా మారినా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సిందే. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ కాగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: