కరోనా వార్తలతో జనం హడలిపోతున్న పరిస్థితులలో వినోదం అన్న పదాన్ని సామాన్య ప్రజానీకం మర్చిపోయారు. అయితే ఒకవైపు కరోనా కరాళ నృత్యం కొనసాగుతూ ఉన్నా టాప్ హీరోల అభిమానులు మటుకు తమ హీరోల భజనను మానడం లేదు. గతవారం  ఉగాది రోజున ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా జూనియర్ చరణ్ ల అభిమానులు తెగ సందడి చేసారు. 


అదేరోజు చిరంజీవి సోషల్ మీడియా ట్విట్టర్ అరంగేట్రంతో పాటు తర్వాత రోజు రామ్ చరణ్ ట్విటర్ లోకి అడుగు పెట్టడం ఆతరువాత చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పై ఒక వీడియోను రిలీజ్ చేయడంతో గతవారం అంతా సోషల్ మీడియాలో కరోనా మెగా కాంపౌండ్ వార్తలతోనే హోరెత్తిపోయింది. దీనితో అల్లు అర్జున్ అభిమానులకు అహం దెబ్బతిని తమ బన్నీని హైలెట్ చేయడానికి మార్గాలు వెతికారు.  


అల్లు అర్జున్ సినిమా రంగంలోకి అడుగు పెట్టి మొన్న శనివారానికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘17 విక్టోరియస్ ఇయర్స్ ఆఫ్ అల్లు అర్జున్’ అనే హ్యాష్ ట్యాగ్‌ తో నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి జరిగింది. బన్నీ ఫ్యాన్స్ నుండి  సినిమా రంగంలోని కొందరు ప్రముఖుల వరకు ఈ హ్యాష్ ట్యాగ్‌ కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బన్నీ తొలి సినిమా ‘గంగోత్రి’ నుండి ‘అల వైకుంఠపురములో’ వరకు బన్నీ ప్రస్థానాన్ని వివరిస్తూ ‘ఇతను హీరోనా’ అనే దగ్గర్నుంచి ‘హీరో అంటే ఇతనే’ అనే స్థాయికి అల్లు అర్జున్ ఎదిగాడు అంటూ బన్నీ స్వయం కృషి పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ తమ హీరోని ఆకాశానికి ఎత్తేసారు. 


అయితే ఈ సందడి అంతా పరిశీలించిన వారు మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి చరణ్ వీడియోకు వచ్చిన అనూహ్య స్పందన చూసి బన్నీ అభిమానులు ఇలా చరణ్ అభిమానులకు వ్యూహాత్మకమైన సవాల్ విసిరారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: