ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ గండం నుండి ఎప్పుడు బయటపడతామో క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం దేశం అంతా అమలు జరుగుతున్న లాక్ డౌన్ పరిస్థితులలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి అనూహ్య స్పందన వస్తోంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు తమతమ స్థాయిలలో విరాళాలను అందిస్తూ చిరంజీవి చేస్తున్న కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు.


టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ హీరోలలో ఒక్క బాలకృష్ణ తప్ప ఇప్పటి వరకు అందరు ఈ ఛారిటీకి భారీగా విరాళాలు ఇచ్చారు. అయితే సామాజిక కార్యక్రమాలు అంటే చాల ముందుగా స్పందించే బాలకృష్ణ ఇంకా ఈ ఛారిటీకి ఎటువంటి విరాళం ప్రకటించక పోవడం బాలయ్య అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. 


చిరంజీవి ఈ ఛారిటీ ఏర్పాటు గురించి బాలయ్యకు చెప్పలేదా ఒకవేళ చెప్పినా బాలయ్య స్పందించలేదా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఛారిటీకి ఇప్పటికే తనవంతు సహాయం ప్రకటించాడు. 


ఇది ఇలా ఉండగా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సీసీసీ తరఫున ఒక పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరచగా చిరంజీవి నాగార్జున వరుణ్ తేజ్ సాయితేజ్ ఈ పాటలో కనిపించారు. అయితే ఈ పాటలో కూడ బాలయ్య ఎక్కడా కనిపించకపోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. కోటి గిటారు వాయిస్తూ తానే స్వయంగా పాడిన ఈ ప్రచార గీతంకు మీడియా చాల విపరీతంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా సిసిసి కోసం చాల ఉత్సాహవంతంగా పనిచేస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకోవడమే కాకుండా తన ఇండస్ట్రీ పెద్దన్న స్థానాన్ని చాల వ్యూహాత్మకంగా మరింత బలపరుచుకుంటున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: