‘ఆచార్య’ మూవీకి త్రిష ఇచ్చిన షాక్ తో అనుష్కను ఎంపిక చేద్దామని కొరటాల చాల గట్టిగా ప్రయత్నించాడు. అయితే ఆమె ‘ఆచార్య’ మూవీలో నటించడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు అన్నవార్తలు వచ్చాయి. దీనితో పారితోషిక విషయంలో వచ్చిన గ్యాప్ తో అనుష్క ‘ఆచార్య’ ను వదులుకుంది అని భావించారు. అయితే అసలు వాస్తవం వేరు. 


తాను చేసే సినిమాల విషయంలో చాల పొదుపుగా నటిస్తున్న అనుష్క చిరంజీవి ‘ఆచార్య’ కన్నా గౌతమ్ మీనన్ తీయబోతున్న మూవీ కథ నచ్చడంతో అనుష్క ఈనిర్ణయం తీసుకుని ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అనుష్క కు గౌతమ్ మీనన్ పై ఉన్న గౌరవంతో చిరంజీవి సినిమాను వదులుకునేలా చేసింది అన్నవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


క్రియేటివ్ దర్శకుడు గౌతమ్ మీనన్ గతంలో తీసిన తమిళ మూవీ ‘రాఘవన్’ పేరుతో తెలుగులో డబ్ అయింది. వెంకటేష్ గతంలో నటించిన ‘ఘర్షణ’ మూవీ ఛాయలతో ఉండే ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో కూడ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలలో గౌతమ్ మీనన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో కమలహాసన్ నటించబోతున్నాడు. గతంలో వచ్చిన ‘రాఘవన్’ మూవీలో కూడ కమల్ నటించడమే కాకుండా పోలీసు ఆఫీసు పాత్రలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ కాబోతోంది అని టాక్. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ తరువాత ఈ మూవీ షూటింగ్ మొదలవుతుంది అని అంటున్నారు.


ఇప్పటికే ఈ మూవీలోని తన పాత్ర విషయం తెలుసుకున్న అనుష్క తన అంగీకారం తెలపడమే కాకుండా తాను గౌతమ్ మీనన్ కోరినట్లుగా బల్క్ డేట్స్ ఇస్తానని చెప్పినట్లు తమిళ మీడియా వార్తలు రాస్తోంది. దీనితో అనుష్క గౌతమ్ మీనన్ కోసం చిరంజీవి ‘ఆచార్య’ ను వదులుకుంద అన్న అనుమానాలు కలుగుతున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: