నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రాంగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా 'వి'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటించగా సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి అంటే టాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేసిన టైం కు రాకుండా తరచూ వాయిదా పడితే ఆ సినిమా పెద్దగాఆడదనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు అదే నెగటివ్ సెంటిమెంట్ నాని 'వి' సినిమాకు వర్తిస్తుందని అంటున్నారు.

 

నాని విలన్ గా సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా 'వి'. ఈ సినిమాలో నానితో సమానమైన రోల్ లో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ముందు ఫిబ్రవరి అనుకున్న ఈ సినిమా మార్చ్ కు వాయిదా వేశారు. ఉగాది రోజుల రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో మరోసారి వాయిదా పడ్డది. ఏప్రిల్ లో రిలీజ్ ఉంటుందా లేదా అన్నది కూడా డౌటే. ఇన్నిసార్లు వాయిదా పడితే సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంతేకాదు టీజర్ రిలీజ్ చేసిన టైం లో ఉన్న బజ్ మళ్ళీ ఏర్పడాలి అంటే మరో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. 

 

నాని చేయక చేయక నెగటివ్ రోల్ లో సినిమా చేస్తే అలాంటి సినిమాకు ఇలాంటి నెగటివ్ సెంటిమెంట్స్ ఇబ్బంది పెడుతున్నాయి. డైరక్టర్ హీరో కాంబినేషన్ లో ఆల్రెడీ రెండు సినిమాలు వచ్చి అవి హిట్ అయ్యాయి కనుక ఈ హ్యాట్రిక్ కాంబో కూడా తప్పకుండా హిట్ కొడుతుందని అంటున్నారు. మరి నాని 'వి' ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలంటే ఆ సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: