రాజమౌళి తన సినిమాలను చాల విభిన్నంగా ఎలా తీస్తాడో అదేవిధంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న కరోనా సమస్య పరిష్కారానికి  సహాయ సహకారాలు అందించే విషయంలో కూడ చాల విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఫిలిం సెలెబ్రెటీలు అంతా తమతమ స్థాయిలలో కరోనా సహాయ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు అందచేస్తున్నారు.


టాప్ హీరోల దగ్గర నుండి టాప్ దర్శకుల వరకు భారీ మొత్తాలను విరాళాలుగా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన రాజమౌళి కరోనా సహాయం విషయమై ఇంకా స్పందించకపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. 


ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ మీడియా సంస్థ రాజమౌళిని ఫోన్ ద్వారా సంప్రదించి కరోనా బాధితుల సహాయం కోసం ఏమిచేస్తున్నారు అని అడిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇరుకున పెట్టె ప్రశ్నకు అయినా చాల తెలివిగా సమాధానం ఇచ్చే రాజమౌళి ఆమీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ అన్ని సహాయాల కంటే ఎవరికి వారు బయటకు రాకుండా తమ ఇంటిలోనే స్వయం నియంత్రణతో బందీలుగా ఉండటం పెద్ద సేవ అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు దేశం కష్టాల్లో ఉన్నప్పుడు అందరు తమ బాధ్యతగా విరాళాలివ్వడం అభినందించాల్సిన విషయం అని అంటూ తమ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ చేయబోతున్న ఒక సేవా కార్యక్రమాన్ని రాజమౌళి బయట పెట్టాడు.  


అందరికోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాటు పడుతున్న పోలీసులు డాక్టర్లు నర్సులకు పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్స్ చాలా అవసరం అని చెపుతూ ఆ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో బాగా తక్కువగా ఉన్న విషయం తన దృష్టి వరకు రావడంతో వాటి గురించి తమ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ చేయబోతున్న సేవా కార్యక్రమాన్ని రాజమౌళి బయటపెట్టాడు. తమ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ తరపున పెద్ద మొత్తంలో ఫేస్ మాస్కులు ప్రొటెక్టర్స్ అందించబోతున్నాం అని తెలియచేస్తూ డాక్టర్లు నర్సులు పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అంటూ జక్కన్న తాను చేయబోతున్న సహాయాన్ని తెలియచేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: