టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ మూవీతో మాస్ మహరాజ రవితేజ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుుడు ఆ తర్వాత దుబాయ్ శీను, కిక్ , పవర్ ఇలా వరుస విజయాలు అందుకున్న తర్వాత వరుస ఫ్లాప్స్ చవిచూశాడు.  దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకొని రవితేజ రీ ఎంట్రీ దుమ్మురేపాడు.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ మూవీ ఎంత సక్సెస్ సాధించిందో.. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ చవిచూశాడు. 

 

 

ఇటీవల ఐవి ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా తో మరో ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని తో ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో బలుపు వచ్చింది.. మంచి విజయం అందుకున్నాడు. రవితేజకు వరస ప్లాప్స్ వస్తున్నా కానీ అవకాశాలకు మాత్రం కొదవ లేదు. క్రాక్ కాకుండా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా కరోనా వైరస్ కారణంగా వాటికి బ్రేక్ పడింది.  

 

 

రమేష్ వర్మ మూవీ కాకుండా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు మాస్ మహారాజా. ఈ కథకు సంబంధించి కొంత లీకులు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. 80ల కాలం నాటి డాన్ గా రవితేజ ఈ మూవీలో నటించనున్నాడట. ఇటీవలే డిస్కో రాజాలో రవితేజ అలాంటి పాత్రనే వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.  డిస్కో రాజాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్నది మేజర్ కంప్లైంట్. కాకపొతే త్రినాధరావు సినిమాలో అవన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: