కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని కారణంగా ప్రపంచదేశాలకి కంటి మీద కునుకు ఉండటం లేదు. ప్రజలు తమ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారు. చైనాలో పుట్టిందని చెప్పబడుతున్న ఈ వైరస్ అనతికాలంలోనే ప్రపంచమంతా విస్తరించి తన విషపు కోరల్ని చాచింది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఎందరో మంత్రులు, ప్రధానులు,సైతం దీని బారిన పడ్డారు.

 

 


ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్, ఆయన భార్య రీటాకి కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఒకానొక సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్ళిన ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన, ఆయన భార్య సెల్ఫ్ క్యారంటైన్ లోకి వెళ్లారు. ఆస్ట్రేలియా వైద్య బృందం వీరిద్దరికీ వైద్యసేవలు అందించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కరోనా నుమ్డి రికవరీ అయ్యారు.

 

 

టామ్ హ్యాంక్స్, ఇంకా ఆయన భార్యకి కరోనా నెగెటివ్ వచ్చిందట. అందువల్ల వారిద్దరినీ ఆస్ట్రేలియా డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు అమెరికాకి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని పంచుకున్న టామ్ హ్యాంక్స్ ఆస్ట్రేలియా డాక్టర్లకి తన కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే తన మంచి కోరిన అందరూ అభిమానులకి దన్యవాదాలు తెలియజేశాడు. మీరంతా ఉండబట్టే నేను కోలుకోగలిగానని చెప్పాడు.

 

 


ఇంకా, రికవరీ అయ్యాక కూడా కొన్ని రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ ని కొనసాగిస్తానని,, సోషల్ డిస్టేన్స్ మెయింటైన్ చేస్తానని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచంలో కరోనాతో బాధపడుతున్న వారు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. చైనాని దాటి, ఇటలీని క్రాస్ చేసి అమెరికా మొదటి ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ రోగులకి పెట్టడానికి వెంటిలేటర్లు కూడా సరిపోవడం లేదని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: