ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో గజగజ లాడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ, స్పెయిన్ మరియు ప్రపంచంలో అగ్రరాజ్యంగా అని తెగ గొప్పలు చెప్పుకునే అమెరికా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టలేక పోతుంది. ఎక్కువ మరణాల సంఖ్య ఈ విషయంలో ఇటలీ ముందుండగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి విషయంలో అమెరికా అన్నిటికంటే ముందు ఉంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు దేశమంతటా షట్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు షట్ డౌన్ కచ్చితంగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా సామాన్య జనులు అత్యవసరం కోసం బయటకు వస్తూ పోలీసుల చేత లాఠీదెబ్బలు తింటున్నారు.

 

చాలామంది సరైన టైంలో బయటకు రాకుండా అందరూ ఇంట్లో ఉన్న టైంలో బయటకు రావడంతో పోలీసులు లాటీ దెబ్బలకు పని చెబుతున్నారు. దీంతో వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాధవీలత పోలీసులు అలా సామాన్యుల ని దారుణంగా కొట్టడాన్ని తప్పు పట్టింది. ఎవరైనా అత్యవసరం వస్తేనే జనాలు బయటకు వస్తారని పనీపాటా లేకుండా ఎందుకు వస్తారు అని ప్రశ్నించింది. కావాలంటే వాళ్లకి ఫైన్ వేయడమో లేకపోతే కేసు నమోదు చేయడం చేస్తే బాగుంటుందని ఆ విధంగా గొడ్డును బాదినట్లు కొట్ట కూడదు అని పోలీసులను తప్పుబడుతూ బ్లడీ స్టుపిడ్‌ పోలీసులు అంటూ కామెంట్ చేయడం తో ఈమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

 

అమ్మ హీరోయిన్ గారు పోలీసులు చేస్తుంది కరెక్టు...వాళ్ల క్షేమం కోసం మన అందరి క్షేమం కోసం కొడుతున్నారు అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. వాళ్లలో ఒకరికి కరోనా వైరస్ సోకిన...వాళ్ల కుటుంబానికి మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతుందని...ఇలాంటి దారుణమైన పదాలు వాడుతూ పోలీసుల పట్ల అంతా అతిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటూ అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: