ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయంతో వణికి పోతున్నారు.  ఈ కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  ప్రస్తతం దేశంలో కరోనా ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆ మద్య కరోనా ఎఫెక్ట్ కోళ్ల వల్ల వస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి.. అంతే దెబ్బకు కోళ్ల రేటు అమాంతం పడిపోయింది.  చివరికి కొన్ని చోట్ల ఫ్రీగా కూడా ఇచ్చారు.  1 రూపాయి కి కోడి గుడ్డు అమ్మే పరిస్థితి వచ్చింది.  ఇలా కోళ్లపై పడిన పెను భారం కోళ్ల ఫారమ్ నడిపేవారిపై పడింది.  కొన్ని చోట్ల ఈ కోళ్ల ఫారమ్ ఎత్తి వేశారు. ఉన్నవారు ఎలా గడపాలో దిక్కు తో చని పరిస్థితి నెలకొంది.

 

 తాజాగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, కోళ్ల ఫారమ్ వ్యాపారంలోకి దిగితే, కరోనా కారణంగా తీవ్ర నష్టం వస్తోందని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ వాపోయాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టాడు. దేశంలో ఎన్ని ఇబ్బందులు వచ్చిన తట్టుకునే స్థాయి ఉన్నవారు.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు.

 

 మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది కోట్లు పెట్టుబడి పెట్టాము. భయంగా వుంది.  దీయబ్బ కరోనా అని ఆయన ట్వీట్ చేశాడు. కాగా, కరోనా భయంతో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే.  గత మూడు నాలుగు రోజుల నుంచి కోడి రేట్లు కాస్త పెరిగిన విషయం తెలిసిందే.  చికెన్ తింటే కరోనా సోకదని నిపుణులు సూచిస్తున్నా, ప్రజలు మాత్రం చికెన్ వైపు చూడని పరిస్థితి నెలకొని వుండటంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: