టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఆవిర్భవించినప్పటి నుండి ఎవరో ఒకరు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. అప్పట్లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. తర్వాత రోజుల్లో దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ బాధ్యత తీసుకున్నాడు. దాసరి నారాయణరావు ఒకప్పుడు ఎలా ముందుండి ఇండస్ట్రీని నడిపించేవారో తెలిసిందే. పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుకొచ్చి నిలబడేవారు. పరిష్కరించేవారు. ఇండస్ట్రీ జనాలకు ఆయన మాట శాసనంలా ఉండేది. ఆయన హఠాత్తుగా చనిపోయాక ఇండస్ట్రీ అనాథ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఆయనలా లీడ్ తీసుకుని అందరినీ నడిపించేది ఎవరన్న ప్రశ్న తలెత్తింది. కొంత కాలం పాటు దీనికి సమాధానం లభించలేదు కానీ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆయనేమీ అధికారికంగా దాసరి స్థానాన్ని తీసుకోలేదు. ఇండస్ట్రీ జనాలకు చిన్న చిన్న సాయాలు చేస్తూ.. సమస్యలవు వచ్చినపుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు చిరు.

 

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఈ రంగంలో మళ్లీ కుదురుకున్నాక చిరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య 'మా'లో సమస్యలు వస్తే చిరునే లీడ్ తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు తన కుటుంబ సభ్యుల సినిమాలకే ఆయన అతిథిగా వచ్చేవాళ్లు. కానీ గత ఏడాదిలో బయటి హీరోలు చేసిన చిన్న చిన్న సినిమాలకు తన తోడ్పాటు అందించారు. ఇప్పుడు కరోనా వైరస్ మీద పోరులో సినీ పరిశ్రమను భాగస్వామిని చేసి ముందుకు నడిపిస్తున్నది చిరునే. ఆయనకు మిగతా మెగా హీరోలు కూడా గొప్పగా తోడ్పాటు అందిస్తున్నారు.

 

పవన్ రూ.2 కోట్ల భారీ విరాళంతో ఇండస్ట్రీలో కదలిక తెస్తే.. చిరు సినీ కార్మికుల కోసం కోటి విరాళం ప్రకటించి స్ఫూర్తి రగిల్చాడు. రామ్ చరణ్ తన వంతుగా ప్రభుత్వానికి రూ.70 లక్షలిచ్చాడు. సినీ కార్మికుల కోసం ఇంకో రూ.30 లక్షల విరాళం ప్రకటించాడు. అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. వరుణ్ తేజ్ రూ.20 లక్షలిస్తే.. సాయిధరమ్ తేజ్ రెండు విడతలుగా రూ.10 పదేసి లక్షల చొప్పున విరాళం ఇచ్చాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఐదు కోట్ల విరాళాలు పోగయ్యాయి. కేవలం తాము విరాళాలు ఇవ్వడమే కాదు.. మిగతా వాళ్లనూ ఆ దిశగా నడిపించడంలో.. కరోనాపై అవగాహన పెంచడంలో చిరు సహా మెగా హీరోలు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి సాటి వచ్చే కుటుంబం ఏదీ టాలీవుడ్లో లేదు. దీనిని బట్టి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీని శాసించే అవకాశాలు లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: