మొదట్లో చరణ్‌ని ఫస్ట్ సినిమా లాంచ్ కోసం రాజమౌళిని చిరంజీవి అడిగారు అయితే చిరు తనయుడు అంటే ఆ క్రేజ్ వేరే ఉండాలి కాబట్టి రాజమౌళి చరణ్‌ని లాంచ్ చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చరణ్ కెపాసిటీ ఏంటో చేడకుండా ఆయన చెయ్యలేనని అందులోనూ మొదటి సినిమా అని రాజమౌళి అరవింద్‌కి, చరంజీవికి తెలిపారు. దాంతో మొదటి సినిమా పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించారు. చిరుత చిత్రంతో ఆయన ఓ మాస్ క్యారెక్టర్లో కనిపించాడు చరణ్. రాజమౌళి చరణ్ రెండో చిత్రానికి దర్శకత్వం వహించారు అదే మగధీర. మగధీర చిత్రం అప్పట్లో సూపర్‌డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి ఇప్పటికీ రాజమౌళి చరణ్ గురించి చేసిన కామెంట్ల్స సంచలనంగా మారాయి. చరణ్‌తో పనిచేసి పదేళ్లకు పైనే అవుతుందని ఆయన అన్నారు. ఆ క్వాలిటీ నాకు మగధీరలో సినిమా కొరకు బాగా ఉపయోగపడింది. అయితే ఇక ఇన్నేళ్లలో చరణ్ నటుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాడు.
అంతే కాక ఆయన ఎంతో పరిణితిని సాధించాడు. రంగస్థలంతో నటుడిగా ఆయన ఉన్నత స్థాయికి చేరాడు. చరణ్ నటనను ఆస్వాదిస్తున్నాడు” అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో 2009లో చరణ్ రెండవ సినిమాగా వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజా అప్డేట్స్ తరువాత ఆర్.ఆర్.ఆర్ మూవీ పై అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. రాజమౌళి మరో విజువల్ వండర్ అందించనున్నాడని భీమ్ ఫర్ రామరాజు వీడియో ద్వారా అందరికి అర్థం అవుతుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా దాదాపు 9నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా రాజమౌళి తాజాగా ఆర్.ఆర్.ఆర్ హీరోలలో ఒకరైన చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఇంత ఆశలు పెట్టుకున్నా ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి. అందులోనూ ఒక హిస్టారికల్ నేపధ్యం కాబట్టి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.