కరోనా నిర్ములనకు ఇప్పటికే కేంద్రానికి 3కోట్లు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 50లక్షల చొప్పున  విరాళం ప్రకటించి ప్రశంసలు అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో 50లక్షల విరాళం ప్రకటించాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతుండడంతో సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్ లు బంద్ అయ్యాయి దాంతో  సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈనేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీ కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చి కరోనా క్రైసిస్ చారీటీ (సిసిసి) అనే సంస్థ ను ఏర్పాటు చేసి వారికి అండగా నిలబతున్నారు.
 
అందులో భాగంగా చిరంజీవి, నాగార్జున చెరో కోటి  ఎన్టీఆర్ ,నాగ చైతన్య చెరో 25 లక్షల విరాళాలను ప్రకటించగా రవితేజ ,వరుణ్ తేజ్ చెరో 20 లక్షలు శర్వానంద్ 15లక్షలు, సాయి ధరమ్ తేజ్ 10లక్షలు ,ఎస్వి సి 10 లక్షలు, విశ్వక్ సేన్ 5లక్షలు, కార్తికేయ 2లక్షలు ,సంపూర్ణేష్ బాబు,లావణ్య త్రిపాఠి లక్ష సీసీసీ కోసం విరాళం ప్రకటించారు. ఇక ఈరోజు ప్రభాస్ కూడా ఈ చారిటీ కోసం 50లక్షలను డొనేట్ చేశాడు. దీనితో ప్రభాస్ మొత్తం విరాళం 4.50 కోట్లకు చేరింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీ నుండి అత్యధిక విరాళం ప్రకటించిన మొదటి హీరో కూడా ప్రభాసే కావడం విశేషం. 
 
ఇదిలావుంటే బాలీవుడ్ విషయానికి వస్తే స్టార్ హీరో  అక్షయ్ కుమార్ ,ప్రధాన మంత్రి సహాయ నిధికి 25కోట్ల విరాళం ప్రకటించాడు అయితే అక్షయ్ తోపాటు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న మిగితా  స్టార్ హీరోలు అమీర్ ఖాన్ ,షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ లు ఇప్పటివరకు ఎంటువంటి విరాళాలను ప్రకటించకపోవడం తో వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: