కరోనా వైరస్ దెబ్బకి ప్రజలంతా చిగురుటాకులా వణికిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు, మేధావులు, సినీ, రాజకీయ సెలబ్రిటిలు అందరూ తగిన జాగ్రత్తలు చెప్తూ ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. నిజంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యులకు ఇంతమంది ధైర్యం నూరిపోయడం చాల మంచి పరిణామం అనే చెప్పాలి. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడమెలాగో అందరూ చెప్తున్నారు. టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తనదైన స్టైల్లో పురాణాలను ఉదహరిస్తూ చెప్పడం ఆకట్టుకుంటోంది.

 

 

మన పురాణాల్లో వాలి, సుగ్రీవుల కథను, రామాయణంలోని సీతాదేవి ఉదంతాన్ని మోహన్ బాబు ఉదహరించాడు. ‘వాలి, సుగ్రివుల యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయిన వెంటనే మళ్లీ వాలిని యుద్ధానికి రమ్మంటాడు. సుగ్రీవుడు మళ్లీ యుధ్దానికి రమ్మంటున్నాడంటే ఏదో మర్మం ఉండి ఉంటుంది.. వెళ్లొద్దు అని చెప్పినా వాలి యుధ్దానికి వెళ్లి సుగ్రీవుడి చేతిలో ఓడిపోయి మరణించాడు. సీతాదేవిని గీత దొటొద్దని లక్ష్మణుడు చెప్పినా వినలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ పెద్దల మాటలు వినకపోతే వచ్చే విపరీత పరిణామాలు అని మోహన్ బాబు వివరించాడు. అనుకోని విపత్తు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని వివరించాడు.

 

 

కరోనా మహమ్మారి విషయంలో దేశ ప్రధాని మోదీ చెప్తున్నదీ ఇదే. ప్రజలెవరూ బయటకు రాకండి.. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి మీ వంతు సహకరిస్తే త్వరగా మనం కోలుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ కొంతమంది వినకుండా ప్రవర్తించడం తగదని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితులు చేయిదాటకుండా ఉండాలన్నా.. ఈ గడ్డు పరిస్థితుల నుంచి త్వరగా బయటపడాలన్నా పెద్దల మాటలు వినాల్సిందేనని ఈ మాటలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ప్రజల క్షేమం కోరి ప్రభుత్వాలు, పెద్దలు.. చెప్తున్న జాగ్రత్తలు పాటించి గత ఆనందాల సమయాలను మళ్లీ తెచ్చుకోవాల్సిన బాధ్య మనపైనే ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: