నందమూరి నటసింహ బాలకృష్ణ పోషించే పాత్రల్లో వైవిధ్యం గురించి తెలిసిందే. ఓ కథను ఓకే చేసాక సినిమా పూర్తయ్యేంత వరకూ దర్శకుల పనిలో వేలు పెట్టడని బాలయ్యకు పేరు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. పటాస్, రాజా ది గ్రేట్ ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు.. సినిమాల డైరక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య కోసమే ఓ పవర్ ఫుల్ కథ రాసినట్టు సమాచారం.

 

 

బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే అనిల్ ఈ కథ సిద్ధం చేశాడనే వార్త ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. ఈ సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నాడట అనిల్. ఇప్పటికే డెవలెప్ చేసిన అనిల్ ఈ కథను అతి త్వరలోనే బాలకృష్ణను కలిసి వినిపించబోతున్నాడని అంటున్నారు. ఈ యంగ్ టాలెంటెడ్ డైరక్టర్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిలింనగర్ సమాచారం. ఈ కథను మల్టీస్టారర్ సబ్జెక్ట్ గా డెవలెప్ చేశాడట అనిల్. ఈ సినిమాలోని ఇంపార్టెంట్ రోల్ ని బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో చేయించి హీరోగా లాంచ్ చేయించే ప్లాన్ చేస్తున్నాడట.

 

 

ఈ కథకు బాలయ్య ఓకే చెప్తాడా.. మల్టీస్టారర్ ప్రపోజల్ కు బాలయ్య ఒకే చెప్తాడా.. మోక్షజ్ఞను తన సినిమా ద్వారా ఎంట్రీ చేయిస్తాడా.. సోలోగానే లాంచ్ చేస్తాడా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. బాలకృష్ణ మాత్రమే హీరోగా ఈ సినిమా చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కథను బాలయ్య చేత ఓకే చేయించే ప్రయత్నాల్లో మాత్రమే ఉన్నాడట. ఈ వార్తలన్నింటిపై క్లారిటీ రావాలంటే అనిల్ నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: