బిగ్ బాస్ రియాల్టీ షో అంటే అందరికీ ఇష్టమే. దేశమంతా దాని కోసం వెంపర్లాడిన సంగతీ తెలిసిందే. ఉత్తరాదిన అయితే బిగ్ బాస్ ఇప్పటికి డజన్ సీజన్లను దాటేసింది. బిగ్ బాస్ లో సెలిబ్రిటీలు అవస్థలు పడుతూంటే బుల్లి తెర ముందు కూర్చుని వీక్షించడం చాలా బాగా  అలవాటైపోయింది. అలా చూసే వారిలో చాలా మందికి బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు పాటు ఉండాలన్న కోరిక కూడా ఎక్కడో ఉండేది.

 

దాన్ని కరోనా వైరస్ తీర్చేసింది. కరోనా విరస్ బిగ్ బాస్ అమ్మ మొగుడి అవతారం ఎత్తేసింది. బయటకు కాలు పెడితే తాట తీస్తానంటూ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ప్రతీ వారూ ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇంట్లో ఉంటూ ఉన్నవి తింటూ లేనివి తలచుకుంటూ ఎంతో భారంగా గడుపుతున్నారు. 

 

కోరింది తెచ్చుకుందామంటే గుమ్మం దాటే వీలు లేదు. ఇక బయటకు కష్టం మీద వెళ్ళినా కూడా షాపులు తెరవరు, పోలీసులు వీపులు సాపు చేస్తారు. ఇది కదా పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కరోనా అనే బిగ్ బాస్ ప్రతీ వారికి ఇంటికే కట్టిపడేసింది. తొంగి చేసే చాన్సే లేదు. ఉన్న చోటే ఉండాలి. అదే ప్రపంచం అనుకోవాలి. అక్కడే సర్దుకోవాలి.

 

చూసిన వారినే చూస్తూ గడపాలి. మొత్తానికి బిగ్ బాస్ ముచ్చట ఇలా కరోనా తీర్చేసిందని అంటున్నారు. సరదాకు బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకునే వారు కూడా ఇపుడు ఇంట్లోనే బిగ్ బాస్ ముచ్చట తీరిపోతోంది అని అంటున్నారంటే కరోనావా మజకానా.

 

ఇపుడు కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ త్రీని ప్రసారం చేస్తున్నారు. దాంతో అది చూసిన వారంతా మనం ఇపుడు ఉన్నది సరిగ్గా అక్కడేగా. కరోనా పుణ్యమని ప్రతీ ఇల్లు అలాగే మారిందిగా అనుకుంటూ తమకు తామే సెటైర్లు వేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: