కరోనా వైరస్ బాధితుల సహాయార్థం సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా కష్టానికి టాలీవుడ్ కూడా ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా వైరస్ విజృంభనతో షూటింగ్‌లు లేక సినిమాలు విడుదల కాక వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి వాళ్ళ కోసం చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు.

 

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, నాగార్జున కోటి రూపాయలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ. 15 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ.10 లక్షలు, విశ్వక్‌సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, బ్రహ్మాజీ రూ.75వేలు, ఆయన తనయుడు సంజయ్ రావు రూ.25 వేలు విరాళంగా అందించారు.

 

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4 అందజేసిన ప్రభాస్.. ఇప్పుడు సినీ కార్మికుల సహాయార్థం రూ. 50 లక్షలు ప్రకటించారు. దీంతో ప్రభాస్ విరాళం మొత్తం రూ.4.5 కోట్లకు చేరింది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసింది ప్రభాస్ ఒక్కరే. విరాళాలు ఇవ్వడంలో కూడా బాహుబలి అనిపించుకున్నాడు. హీరోయిన్ ప్రణీత తన వంతు సాయంగా 50 కుటుంబాలకు 2000 రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ముందుకొచ్చి లక్ష రూపాయల విరాళం ప్రకటించింది. కరోనా క్రైసిస్ ఛారిటీ‌కి విరాళం ఇచ్చిన నటిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ...''రోజూవారీ వేతనాలపై పనిచేసే సినీ కార్మికులకు సిసిసి ద్వారా నా వంతు సాయం అందిస్తున్నాను. ఇందులో భాగంగా రూ. 1 లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నాను'' అని పేర్కొంది. విరాళాలు అందించిన హీరోయిన్లలో వీళ్లిద్దరే మొదటివారు కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: