ప్రపంచ వ్యాప్తంగా  ప్రజల్లో కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలు నింపుతోంది.  గత మూడు రోజుల్లోనే మృతుల సంఖ్య రెట్టింపవడం మరింత వణికిస్తోంది.   మృతుల సంఖ్య భారీగా ఉండటం మరింత కలవరపరుస్తోంది. కరోనా పంజా విసురుతోన్న వేళ దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  కరోనాని అరికట్టే ప్రయత్నంలో రాజకీయ, క్రీడా, సినీ రంగానికి చెందిన వారు ఎంతో మంది ముందుకు వస్తున్నారు.  భారత ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్స్ పెద్ద ఎత్తన విరాళం ఇచ్చి తమ దేశ భక్తి చాటుకున్నారు.  సినీ నటుడు అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు విరాళం ప్రకటించారు.  

 

ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన హీరోలు తమ వంతు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.  అయితే ఇంత క్లిష్ట పరిస్థితిలో రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూడటం అంటే కత్తిమీద సాము అంటారు.  అలాంటిది లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని, వాళ్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

 ఈ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ‘ట్రూ లీడర్.. శాల్యూట్’ అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వీడియోను జతపరిచాడు. నిజంగా ఇలాంటి నాయకుడు చూసి ఎంతో మంది నేర్చుకోవాలని అన్నారు.  తెలంగాణలో పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ  బియ్యం, గోధుమ పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు కూడా అందజేస్తామని నిన్న కేసీఆర్ ప్రకటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: