తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకో స్టైల్, తన సినిమాల మీద ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తున్నాడు విశ్వక్. 2019లో వెంకటేశ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్2 నచ్చలేదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

 

ఇటివల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కొన్ని రకాల సినిమాల జోనర్ కే నేను వ్యతిరేకం. కమర్షియల్ అని పేరు పెట్టుకుని చేసే కొన్ని సినిమాల్లో ఏముంటుందో అర్ధం కాదు. ఎఫ్2 సినిమానే తీసుకుంటే ఆ సినిమాలో కథ ఏమీ లేదు. కమర్షియల్ సినిమా అర్ధం మార్చేస్తున్నారు తప్ప మరింకేమీ లేదు. కుళ్లు జోకులు ఉండే ఆ రకమైన సినిమాలకు నేను వ్యతిరేకం. అలాంటి సినిమాలు నేను చేయలేను. ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ.. అలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం కూడా ఓ కళే. 100కోట్లకు పైగా వసూలలు చేసిన సినిమా అది. నా దృష్టిలో కేరాఫ్ కంచరపాలెం కమర్షియల్ సినిమా’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

 

 

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు విశ్వక్ సేన్ పై విమర్శలు చేస్తున్నారు. వెంకటేశ్ సినిమాను విమర్శించే స్థాయి నీకు లేదు, సీనియర్ హీరో అనే రెస్పెక్ట్ కూడా నీకు లేదు, నీకు ప్రమోషన్ చేసిన వెంకటేశ్ నే విమర్శిస్తావా.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి.. వెంకటేశ్ అభిమానులు, సినీ అభిమానులు చేస్తున్న విమర్శలకు విశ్వక్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి. రీసెంట్ గా హిట్ మూవీ చేసి హిట్ కొట్టాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: