టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  దర్శకత్వం‘చిరుత’ మూవీలో తనదైన పర్ఫామెన్స్ చూపించాడు రామ్ చరణ్. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ అన్నింటా మెగా హీరో పవర్ ఏంటో చూపించాడు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ మూవీతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు.   రాజమౌళి తాజా మూవీ 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో చరణ్ గురించి రాజమౌళి మాట్లాడుతూ, 'గతంలో చరణ్ తో 'మగధీర' చేశాను. అప్పుడు నేను చూసిన చరణ్ వేరు .. ఇప్పుడు నేను చూస్తున్న చరణ్ వేరు.

 

'రంగస్థలం' సినిమా చూసిన తరువాత నటన పరంగా చరణ్ చాలా మెట్లు ఎక్కేశాడనే విషయం నాకు అర్థమైంది.  రామ్ చరణ్ ప్రతి సినిమా సినిమాకు తనదైన నటనను ఎంతో గొప్పగా మల్చుకుంటున్నాడు.  తండ్రి బ్యాగ్ గ్రౌండ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా తండ్రికి తగ్గ తనయుడి గా పేరు తెచ్చుకుంటున్నాడు.  మెగాస్టార్ చిరంజీవి తనయుడు అని ఏనాడు గర్వపడకుండా ప్రతి సినిమా కోసం తనదైన స్టైల్ చూపిస్తుంటాడు.  నటుడు గానే కాకుండా నిర్మాతగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే నటన పరంగా ఎక్కడా డ్యామేజ్ లేకుండా ప్రొఫెషన్ కొనసాగిస్తున్నాడు. 

 

 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో ఆయన నటనను ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని చూశాను. నటన పట్ల ఆయనకి గల అంకితభావాన్ని గమనించాను. చరణ్ ఈ స్థాయిలో తన పరిణతిని కనబరచడం ఆశ్చర్యంగాను .. ఆనందంగాను వుంది" అంటూ ప్రశంసించారు.  ఆర్.ఆర్.ఆర్ మూవీలో రామ్ చరణ్ ని ఎలా చూపించాలో అలా చూపించాం.. మొన్న రిలీజ్ అయిన టీజర్ కి ఎంతో మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: