అస‌లే సోష‌ల్ మీడియా కాలం ఇదీ..అందులోనూ సెల‌బ్రిటీలు... గుట్టుగా సాగించే..ప్రేమ వ్య‌వ‌హారాలు..లిప్‌లాక్ సీన్లు బ‌య‌ట‌ప‌డితే ఊరుకుంటారా..? నెటిజ‌న్లు ఓ ఆటేడేసుకోరు..క్ష‌ణాల్లో వేల‌ల్లో వైర‌ల్ చేసేయ్య‌రు.. అప్ప‌ట్లో అదే జ‌రిగింది ద‌క్షిణాది చిత్ర సినిమాలో గాయ‌నిగా, న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా విష‌యంలో. సుచీలీక్స్ పేరు దాదాపుగా అంద‌రూ వినే ఉంటారు. ఈమె గ‌తంలో ద‌క్షిణాదికి చెందిన చాలామంది హీరో హీరోయిన్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఎఫైర్స్‌ను, వ్య‌క్తిగ‌త ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్టి పెను దుమార‌మే లేపింది. ఆమె విడుద‌ల చేసిన ఫొటోల్లో అనిరుధ్ మ‌రియు ఆండ్రియా సాంగించిన రాస‌లీల‌లు, లిప్‌లాక్ సీన్ ఫొటోలు కూడా ఉన్నాయి. 

 

అయితే ఈ ఎపిసోడ్ గ‌డిచి చాలా కాల‌మే అయినా ఆండ్రియాను మాత్రం ఆ బాధ మాత్రం వెంటాడుతూనే ఉందంట. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ అలాంటి విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చినందుకు మీకు బాధ‌గా లేదా...? అంటూ ప్ర‌శ్నిస్తే...ఎవ‌రికీ ఉండ‌దు..చెప్పండి..నేను ఆడ‌దాన్నే..అలాంటి విష‌యాలు అంద‌రికీ తెలియాల‌నుకోను. అయితే అనిరుధ్‌తో అప్ప‌ట్లో ఆ బంధం ఉండేంది. ఆ విష‌యం నేనేమీ దాచాలి అనుకోవ‌డం లేదు. కానీ అలా మేము చాలా ప్రైవ‌సిగా గ‌డిపిన ఫొటోలు బ‌య‌ట‌కి రావ‌డం అనేది నన్ను తీవ్రమైన బాధ‌కు గురి చేస్తోంది అంటూ విచారం వ్య‌క్తం చేసిందంట‌. అయితే అనిరుధ్‌తో ఇప్పుడు స్నేహం మాత్ర‌మే కంటిన్యూ అవుతోంద‌ని ఆ బంధం గురించి కాస్త క్లారిటిగానే చెప్పింది. 

 

ఈ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అనిరుధ్‌కు త‌న‌కు ప‌ర్స‌న‌ల్‌గా సారీ చెప్పాడ‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా కొద్ది రోజుల క్రితమే వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పేసుకున్న విష‌యం తెలిసిందే.వాస్త‌వానికి `సుచీ లీక్స్` ద‌క్షిణాదిలో ఎన్నో వివాదాలు సృష్టించింది.  ప్ర‌ముఖ హీరోయిన్స్‌ త్రిష‌, అమ‌లాపాల్‌, గాయ‌ని ఆండ్రియాతో పాటు ధ‌నుష్‌, అనిరుధ్, రానా త‌దిత‌రుల వ్య‌క్తిగ‌త ఫొటోలు వెలుగు చూశాయి. సుచిలీక్స్ పేరు ఎత్త‌గానే ఇప్ప‌టికీ కొంత‌మంది ప్ర‌ముఖులు గుండెల‌పై చేయి వేసుకుంటారట‌. చూడాలి దీనిపై ఇంకా ఎంత‌మంది ప్ర‌ముఖులు త‌ర్వాతి రోజుల్లో స్పందిస్తారు అనేది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: