దేశంలో ఇప్పుడు కరోనా భయంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  కరోనా వైరస్ మన దేశంలో మొదలైనప్పటి నుంచి విదేశాల్లో స్వదేశంలో సినీ షూటింగ్ క్యాన్సల్ చేసుకున్నారు.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో అన్నీ బంద్ బంద్.. దాంతో పేద ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇక సినీ పరిశ్రమంలో రోజు వారి కార్మికుల కష్టాలు తీర్చడానికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.  ఆయన బాటలో మరికొంత మంది హీరోలు విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. విరాళాలు ప్రకటించిన వారిలో నాని,అల్లు అర్జున్, సుశాంత్ తదితరులు ఉన్నారు. 

 

సినీ కార్మికులకు అండగా ఉండే నిమిత్తం చిత్ర పరిశ్రమ నుంచి కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన వారికి ప్రముఖ హీరో చిరంజీవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.  తెలుగు హీరోలు నాని- రూ.30 లక్షలు, అల్లు అర్జున్- రూ. 20 లక్షలు, శ్రీమిత్రా చౌదరి- రూ.5 లక్షలు, సుశాంత్- రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్- రూ.2 లక్షలు, సంపూర్ణేశ్ బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించినట్టు ఆ పోస్ట్ లో తెలిపారు.  ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసిన చిరంజీవి, తాజాగా ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారన్న వివరాలను ఇందులో పొందుపరిచారు.

 

సినీ కార్మికుల ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని.. అన్ని రకాలుగా ఆదుకునేందుకు సినీ తారలు ముందుంటారని అన్నారు.  ఇక కరోనా భయంతో దేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కి మరికొంత మంది హీరోలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.    బాలీవుడ్ లో స్టార్ హీరోలు పీఎం రిలీఫ్ ఫండ్ కి పెద్ద ఎత్తు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోతున్న సినీ పేద కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘సి.సి.సి. మ‌న‌కోసం’ (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే చారిటీని ఏర్పాటు  చేసిన విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: