టాలీవుడ్ లో బుల్లితెరపై ఒకప్పుడు తెనాలి రామకృష్ణ సీరియల్ వస్తుందంటే టీవిలకు అతుక్కుపోయేవారు.  ఈ సీరియల్ లో కొత్త కొత్త కథలతో అప్పట్లో బుల్లి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.  ఈ సిరియల్ లో తెనాలి రామకృష్ణ పాత్రలో నటించిన  అశోక్ కుమార్ తర్వాత ఎన్నో సిరియల్స్ లో నటించారు.   సుదీర్ఘ కాలంగా ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తూనే వచ్చారు. తర్వాత వెండి తెరపై ఎన్నో కామెడీ పాత్రల్లో నటించారు.  కమెడియన్, యాంకర్ గా బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న అశోక్ కుమార్ వెండి తెరపై నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

తాాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  మొదట నేను నటనను కెరియర్ గా అనుకోలేదు .. సరదాగా నటించి చూద్దాం అన్నట్టుగా వచ్చాను. రవీంద్రనాథ్ చౌదరి గారు నన్ను తీసుకెళ్లి దర్శకుడు విజయబాపినీడు గారికి పరిచయం చేశారు.  నాకు సీరియల్స్ లో నటించిన అనుభవం ఉండటంతో ఆయన తీస్తున్న సినిమాలో మంచి ఛాన్సు ఇచ్చారు.  ‘పున్నమిచంద్రుడు’ సినిమాలో నాకు మొదటి అవకాశం వచ్చింది.  వెండితెరపై నా ప్రస్థానం ఓ గొప్ప నటుడితో మొదలైంది.. ఆయనే టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు.  ఆయనతో నటించడం నిజంగా నా అదృష్టం అనే చెప్పొచ్చు. 

 

 

'ఖైదీ నెంబర్ 786' .. 'నాకూ పెళ్లాం కావాలి' .. 'మహారాజశ్రీ మాయగాడు' ఇలా వరుసగా చేసుకుంటూ వచ్చాను. గోపికృష్ణ మూవీస్ లో కృష్ణంరాజుగారి సినిమా చేస్తుండగా, 'తెనాలి రామకృష్ణ' సీరియల్లో నటించే అవకాశం వచ్చింది.  ఈ సిరియల్ అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు ఎంతోగానో నచ్చింది.. అందుకే ఆ సిరియల్ ఇప్పటికీ మర్చిపోలేదు.  తెలుగు బుల్లితెరపై వచ్చిన గొప్ప సీరియల్స్ లో తెనాలి రామకృష్ణ ఒకటి అని చెప్పొచ్చు.  ఆ సీరియల్ నాకు ఎంత పేరు తెచ్చిందో మీకు తెలిసిందే  అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: