ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా దివంగత దాసరి నారాయణరావు ఉండేవారు. పరిశ్రమకి ఎలాంటి అవసరం వచ్చినా సమస్య వచ్చినా ముందుండి పరిష్కారాన్ని చూపేవారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా దాసరి నారాయణరావు మాటను బాగా గౌరవించేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆయన లేని లోటు స్పష్టంగా కనబడటంతో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వారు ఆయన స్థానంలో ఒక్కరు రావాలని కోరుకునేవారు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల ఎక్కువగా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు స్థానంలో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి వస్తే చాలా బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.

 

ఇదే తరుణంలో ఇటీవల మెగాస్టార్ కూడా ఇండస్ట్రీలో చిన్న పెద్ద స్టార్ హీరో అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి సినిమా వేడుకలకు హాజరవుతూ వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ పరంగా హీరోలు ఏం చేయాలి నిర్మాతలు ఏ విధంగా వ్యవహరించాలి ఇలా అనేక విషయాల గురించి బహిరంగంగానే సినిమా వేదికలపై చిరంజీవి మాట్లాడుతున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని సినిమా షూటింగులు ఆగిపోవటంతో చాలామంది సినీ కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

 

ఈ పరిస్థితుల్లో సీసీసీ అనే సంస్థకు నాంది పలికి ఓ గొప్ప పనికి పూనుకున్నారు చిరు. దీంతో చాలామంది చిరంజీవి చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇండస్ట్రీలో మొట్టమొదటిగా షూటింగ్ చేయడం మానేసి నట్లు చెప్పిన మొదటి హీరోగా కూడా చిరంజీవి కావటం విశేషం. ఇటువంటి తరుణంలో ఇన్ని పనులు చేస్తున్న చిరంజీవి తపన తాపత్రయం చూస్తుంటే దాసరి నారాయణరావు స్థానం కచ్చితంగా రీప్లేస్ చేయడం గ్యారెంటీ అని చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: