కరోనా వైరస్ ప్రభావానికి ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వీరికి ధైర్యం చెప్పేందుకు ఎంతో మంది మేధావులు, సినీ సెలబ్రిటీలు తమ సందేశాలతో, సూచనలతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమ స్పందించిన తీరు అద్భుతమే అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నుంచి సంపూర్ణేష్ బాబు వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఏ ఈ ఆపత్కాలంలో పనులు కోల్పోయిన తెలుగు సినీ కార్మికులకు అండగా నిలిచారు.

 

 

సినిమా షూటింగులే ఉపాధిగా ఉన్న కార్మికులకు ఇంతమంది సినీ తారలు స్పందించి విరాళాలు ప్రకటిస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు.. సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీకి కూడా ఇప్పటికీ వరకూ ఏ విరాళమూ ప్రకటించలేదు. చిరంజీవి 1కోటి రూపాయలను కార్మికుల సంక్షేమానికి విరాళంగా ఇవ్వడమే కాకుండా ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ని నెలకొల్పి చైర్మన్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. చిరంజీవి పిలుపుకు స్పందించి సినీ పరిశ్రమ మొత్తం కదిలింది.

 

 

నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేశ్, ప్రభాస్, నాని.. ఇలా స్టార్ హీరోలు, నటులు అందరూ లక్షల్లో, కోట్లలో సీసీసీకు విరాళాలు ప్రకటిస్తున్నారు. విజయ్ తీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సూపర్ స్టార్ డమ్ అందించిన ప్రేక్షకులను ఆపత్కాలంలో ఆదుకునే బాద్యత లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం సినీ కార్మికులకు అండగా ఉంటే విజయ్ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. చిరంజీవి పిలుపుకు స్పందించి ఇండస్ట్రీనే కదిలొస్తే విజయ్ తీరు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. మరి దీనిపై విజయ్ దేవరకొండ సమాధానమేంటో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: