కరోనా వైరస్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లింది. సినిమా షూటింగులు మొత్తం ఆగిపోవడంతో చాలామంది సినిమా కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంతో దేశంలో రవాణా తో పాటు అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో కూడా సినిమా షూటింగ్లో ఆగిపోవటంతో సినీ ఇండస్ట్రీ ని నమ్ముకున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ రోజుకి ఆ రోజు జీవితం ఉన్నట్టుగా వాళ్ళు బతికే జీవితం అవటంతో వాళ్లని ఆదుకోవటానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు.

 

తాజాగా ఆయన ఆధ్వర్యంలో  కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) చారిటీ ఏర్పాటు చేశారు. ఈ చారిటీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షలు అదేవిధంగా బన్నీ 20 లక్షలు విరాళంగాప్రకటించారు. ఇద్దరు అంతకు మునుపే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో కుర్ర హీరో సందీప్ కూడా ఈ చారిటీ కి మూడు లక్షలతో సినిమా కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. దీంతో పాటు ‘వివాహ భోజ‌నంబు’ రెస్టారెంట్ల‌లో ప‌నిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగుల‌ను సైతం ఆయ‌న చూసుకుంటున్నారు.

 

అలాగే నటుడు బ్రహ్మాజీ కూడా 75 వేల రూపాయలు ఈ చారిటీకి ఇవ్వడం జరిగింది. నాగార్జున కోటి రూపాయలు ఇంకా చాలా మంది హీరోలు తమ విరాళాలు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) చారిటీకి అందించడం జరిగింది. దీంతో వచ్చిన డబ్బుతో మొత్తమంతా సినీ కార్మికులకు అన్ని విధాల వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండడం కోసం చారిటీ ని స్థాపించిన చిరంజీవి...ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అదేవిధంగా పిల్లల విషయంలో ఫీజుల విషయంలో ఆర్థిక సహాయం చేయాలని డిసైడ్ అవుతున్నట్లు ఫిలింనగర్ లో టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: