ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల చాలామంది జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల్లో ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయాందోళనలతో బతుకుతున్నారు. యూరప్ దేశాలలో అనేకమందిని బలి తీసుకున్న ఈ వైరస్ ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదిలోనే దీన్ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ అమలులోకి తీసుకువచ్చింది. దాదాపు 21 రోజులపాటు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా పాటిస్తున్నాయి. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పక్కాగా అమలు చేస్తున్నారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగులు మొత్తం ఆగిపోవడంతో సినిమా కార్మికుల జీవితాలు రోడ్డున పడినట్లయింది. ఇటువంటి పరిస్థితుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమా కార్మికులను ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ముందుగా సినీ నటుడు రాజశేఖర్ సినిమా కార్మికులకు నిత్యావసర సరుకులను ఇండస్ట్రీలో ఏ హీరో స్పందించక ముందు పంచడం జరిగింది. అయితే ఇటీవల ఒక్కొక్కరు ప్రభుత్వాలకు తమ విరాళాలు భారీస్థాయిలో ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) చారిటీ ని ఏర్పాటు చేసి దానికి, చాలా మంది సినిమా హీరోలు ఆర్టిస్టులు విరాళాలు ఇస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో అందరు హీరోలు పేర్లు వినబడుతున్న గాని, కరోనా వైరస్ విరాళాల విషయంలో నందమూరి బాలకృష్ణ పేరు ఇప్పటివరకు వినపడలేదు. ఈ విషయంలో ఆయన ఏం చేస్తారు అన్న దానిపై అందరూ ఉత్కంఠగా ఉన్నారు. అయితే ఈ తరుణంలో బాలకృష్ణ కరోనా వైరస్ రోగులను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వైద్యులకు ఏదైనా గట్టిగా హెల్ప్ చేయడానికి రెడీ అవుతున్నట్లు, అదేవిధంగా పోలీసు శాఖ కి కూడా భారీ మొత్తంలో విరాళం ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: