టాలీవుడ్ లో నేచురల్ స్టార్ స్పీడ్ ఏంటో అందరికి తెలిసిందే. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా సంవత్సరానికి మూడు సినిమాలు విడుదల చేసేస్తుంటాడు. సాధారణంగా మన టాలీవుడ్ లో కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయంటే కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళలో నితిన్ ని ప్రస్తుతం ఉదాహరణగా తీసుకోవచ్చు. దాదాపు హిట్ వచ్చి నాలుగేళ్ళు అయింది. అందుకే గత సంవత్సరం అంతా ఖాళీగా ఉండి మంచి కథ లని వి లైన్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కో సినిమాతో వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన భీష్మ తో హిట్ అందుకున్నాడు.

 

అయితే నాని ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ కి బ్రేక్ చెప్పి లాక్ డౌన్ లో భాగంగా అందరిలాగానే నాని కూడా ఇంట్లో ఉంటున్నాడు. ఫ్యామిలీకి కావాల్సినంత టైమ్ కేటాయించే నాని ఇప్పుడు ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో కావలసిన సినిమాలతో కాలక్షేపం చేస్తున్నాడు. త్వరలోనే నాని నటించిన 'వి' సినిమా ఈ నెలలో రిలీజ్ కి రెడీ అయింది. ఇక కరోనా వ్యాప్తితో నెక్స్ట్ సినిమాకి బ్రేక్ ఇచ్చిన నాని ఇంతకాలం చూడకుండా మిస్సయిన సినిమాలన్నిటిని చూస్తూ తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నాడు. 

 

అంతేకాదు వరుసగా టాలీవుడ్ లో అందరూ పేదల సహాయార్ధం వాళ్ళ వాళ్ళ సాధ్యా సాధ్యాలను బట్టి విరాళాలను ప్రకటించి సమాజం పట్ల తమ బాధ్యత ని చాటుకుంటున్నారు. ఇప్పుడు నాని కూడా తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. నేచురల్ స్టార్ నాని కూడా సినీ వర్కర్ల కోసం 30లక్షల రూపాయలు విరాళం అందించి తన గొప్ప మనసుకుని చాటుకున్నాడు. అయితే నేచురల్ స్టార్ నాని స్పందించి విరాళం అందించడంతో సినీ అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా విరాళాలు అందిస్తూ తమ చిత్ర పరిశ్రమకి తామే అండగా నిలబడుతున్నామని ఇది నూటికి నూరు శాతం మా బాధ్యత అని అందరూ భావించడం గొప్ప విషయం.  


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: