టాలీవుడ్ కంటే కోలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే హాట్ హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసందే. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్స్ చూస్తే హాలీవుడ్ హీరోయిన్స్ అనే అనుకోవాలి. అంతగా తేడా లేకుండా అందాల ఆరబోతని గాని హాట్ ఫోటో షూట్స్ తో గాని ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రియాంక చోప్రా, రాధిక ఆప్టే లాంటి వాళ్ళు హాలీవుడ్ సినిమాలలోను అవకాశాలు దక్కించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆ జాబితాలో ఉన్న మరో హాట్ బ్యూటి దిశా పటాని. ఈ బ్యూటి బాలీవుడ్ లో ఎంతమంది హాట్ హీరోయిన్స్ ఉన్నా కూడా తన స్టైలే వేరు. అందుకే బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది.

 

ఇక సినిమాలే కాదు సోషల్ మీడియాలో దిశా తన గ్లార్ ట్రీట్ ఇస్తూ నిరంతరం జనాలకి చమటలు పట్టిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ హీటెక్కెస్తుంది. ఇప్పుడు కూడా లాక్ డౌన్ కావడంతో అవుట్ డోర్ లో కాకుండా తన ఇంట్లోనే.. ఉంటూ రిలాక్స్ అవుతోంది. అలా రిలాక్స్ అవుతూనే హాట్ ఫొటోస్ ని తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. ఇక ఈ బ్యూటి మీద హాట్ గాసిప్స్ కూడా బాగానే వస్తుంటాయి. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో లవ్ లో ఉన్న దిశా త్వరలో పెళ్ళి చేసుకోబోతుందన్న వార్తా బాగా వైరల్ అవుతోంది. 

 

ఇక దిశ పఠాని టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. లేదంటే టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చేవి. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ తన ఖాతాలో హిట్స్ ని వేసుకుంటుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రాధే' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: