టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల అత్యద్భుత విజయాల తరువాత మన దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా ఏర్పడింది. అంతేకాక అనేకమంది విదేశీయలు కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ అయ్యారు. ఆ విధంగా ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ నటుల్లో అత్యధిక మార్కెట్ వేల్యూ తో పాటు అధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా గొప్ప పేరు సంపాదించారు. అయితే బాహుబలి 2 తరువాత కొంత గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాలో ప్రభాస్ నటించడం జరిగింది. దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా మాత్రం ఫ్యాన్స్, అలానే ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో కొంత విఫలం అయింది. 

 

దానికి కారణం సినిమాలో ఎంతో భారీగా హంగులు, ఆర్భాటాలు, అదిరిపోయే విజువల్స్, గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధ, దర్శకుడు సుజీత్ కథపై పెట్టలేదు అంటూ అప్పట్లో కొంత విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తో జాన్ మూవీ చేస్తున్న ప్రభాస్, దాని అనంతరం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన రావడం జరిగింది. 
అయితే అందుతున్న సమాచారాన్నిబట్టి ఆ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉంటుందని, అలానే సినిమాకు దాదాపుగా రూ.400 కోట్ల వరకు భారీ ఖర్చు పెట్టనున్నారని టాక్. పాన్ ఇండియా ఫీల్ తో పలు భారతీయ భాషల్లో తెరకెక్కనున్న ఆ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని దర్శకుడు నాగ అశ్విన్ ఇటీవల ప్రకటించారు.

 

అయితే అది కూడా సాహో మాదిరిగా కేవలం హంగులు, ఆర్భాటాలు భారీ ఖర్చుతో ఉంటే మాత్రం దెబ్బతినడం ఖాయం అని, అందుకని దర్శకుడు అశ్విన్, ఇప్పటినుండే వాటికంటే ముందు సినిమా కథ, కథనాల మీద ఎంతో శ్రద్ధ పెట్టాలని పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు సూచనలు చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: