టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 20 శాతం పూర్తి అయినట్లు సమాచారం. ఇటీవల బాలయ్య గుండు చేయించుకున్న తరువాత సినిమాకు సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను కొద్దిరోజుల పాటు చిత్రీకరించిందట సినిమా యూనిట్. 

 

అయితే ఈ సినిమా కోసం బాలయ్య చాలా వరకు వెయిట్ తగ్గి ఎంతో స్లిమ్ గా తయారయ్యారని, గతంలో బాలయ్య, బోయపాటి ల కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలను మించేలా ఆయన పాత్ర ఈ సినిమాలో ఉండనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య గుండు చేయిచుకోవడం వెనుక ఒక అంతరార్ధం దాగి ఉందని సమాచారం. వాస్తవానికి ఎప్పుడూ తన సినిమాల్లో విగ్ పెట్టుకుని దర్శనం ఇచ్చే బాలయ్య, ఈ సినిమాలో సొంత హెయిర్ స్టైల్ తో మంచి ట్రెండీ లుక్ లో ఫ్యాన్స్ ని థ్రిల్ చేయనున్నారట. 

 

వాస్తవానికి ఈ సినిమా కోసమే బాలయ్య ఇటీవల విదేశాలకు వెళ్ళి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని వచ్చారని, అందువలనే ఆయన గుండు చేయించారని, అయితే పూర్తిగా జుట్టు పెరగడానికి దాదాపుగా రెండు నెలలు సమయం పడుతుందని, అందునా మధ్యలో కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్ ఆగిపోవడంతో, ఈలోపు ఫుల్ గా జుట్టు పెంచి మంచి స్టైలిష్ గా తయారయ్యేలా బాలయ్య సిద్ధం అవుతున్నారట. ఇప్పటివరకు విగ్ లతో కనిపించిన బాలయ్య, నిజంగానే ఈ సినిమాలో సొంత క్రాఫ్ తో వెరైటీ గా కనిపిస్తే థియేటర్స్ లో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: