విక్టరీ వెంకటేష్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో గా ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నారన్న సంగతి తెలిసిందే. 30యేళ్ల సినీ కెరీర్ లో వెంకటేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ఎందరో గొప్ప దర్శకులతో కలిసి పనిచేసారు. ఇన్నేళ్లు సినీ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలల్లో ఎక్స్‌పరిమెంట్స్ చేయాలంటే ముందు వెంకీ గురించే చెప్పుకుంటారు. అందుకు కారణం కథ నచ్చిందంటే ఆయన ఎలాంటి పాత్రలో అయినా కనిపించడానికి రెడీ అయిపోతారు. అలా వచ్చిన సినిమాలు గణేష్, ధర్మ చక్రం, చంటి, ఘర్షణ, గోపాల గోపాల వంటి చిత్రాలే. 

 

ఇక మల్టి స్టారర్ అంటే వెంకీ హీరో ఎవరైనా ఆ హీరో కలిసి నటించడానికి ఒకే చెప్పేస్తారు. అంతేకాదు  వెంకటేష్ ఇప్పటికి హీరోగానే కొనసాగుతున్నారంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గురు సినిమా తర్వాత వరసగా సినిమాలు చేయలేకపోయినప్పటికి ఎఫ్ 2 వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరుణ్ తేజ్ తో నటించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇక రీసెంట్ గా వెంకీమామ సినిమా విజయంతో జోరు పెంచారు. ఈ సినిమాలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించి మంచి హిట్ అందుకున్నారు. వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న నారప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించే నెక్స్ట్ సినిమా గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించబోయో సినిమాలో నటిస్తాడని. అయితే గతంలో కూడా వెంకటేష్ తరుణ్ తో సినిమా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుండి తరుణ్ కూడా స్క్రిప్ట్ పకడ్బందీగా తయారుచేసే పనిలో పడ్డాడు. తరుణ్ చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. స్పోర్ట్స్ డ్రామా చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. మరి అసురన్ తర్వాత వెంకటేష్ నటించే సినిమా ఇదే నా లేక మరోటా అని అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ తో సినిమా వద్దన్నట్టుగా కూడా కొందరు వెంకీకి సలహా ఇస్తున్నారట. కారణం ఈ కుర్ర దర్శకుడిగా  హీరోగా కంటిన్యూ కావాలా లేదా దర్శకుడిగా కంటిన్యూ కావాలా అన్న క్లారిటి లేదని ఒకవేళ పొరపాటున కమిటయి సినిమా చేస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోనని అభిప్రాయపడుతున్నారట. 
   


 

మరింత సమాచారం తెలుసుకోండి: