టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినిమాల్లో సేడ్ రోల్స్ చేస్తూ అలరించే రవి వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చాట్ చేసిన రవి వర్మ టాలీవుడ్ హీరోల గురించి తన సొంత మాటల్లో చెప్పుకొచ్చాడు. అందరి హీరోల గురించి ఏమో కానీ అల్లు అర్జున్ గురించి మాత్రం స్పెషల్ గా చెప్పుకొచ్చాడు రవి వర్మ. బన్నీ ప్రతిదీ చాలా కొత్తగా ట్రై చేస్తాడని.. అతని స్టైల్ చాలా బాగుటుందని అన్నాడు. అంతేకాదు డ్యాన్స్ లో కూడా అదరగొడతాడని రవి వర్మ అభిప్రాయపడ్డాడు. 

 

బన్నీ స్టైల్ ను బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో పోల్చాడు రవి వర్మ. అక్కడ షారుఖ్ ఎలా స్టైల్ గా ఉంటారో మన దగ్గర బన్ని అలా స్టైలిష్ గా ఉంటారని అన్నాడు. రవి వర్మ మాత్రమే కాదు అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి నుండి ఈరోజు అల వైకుంఠపురములో బంటు పాత్రని చేసిన తీరుని చూసి ఎవరైనా బన్ని కష్టాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. నిర్మాత కొడుకుగా పెద్దగా కష్టపడకుండా సినిమాలు చేసేయొచ్చు కానీ అల్లు అర్జున్ అలా కాదు తాను చాల కష్టపడతాడు. 

 

అందుకే అతన్ని అభిమానించే ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉంటారు తెలుగులోనే కాదు అల్లు అర్జున్ కు మల్లూవుడ్ లో కూడా అదిరిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ ను అక్కడ మల్లూ అర్జున్ అనేస్తారు. అక్కడ స్టార్ సినిమాలకు ధీటుగా బన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. కేరళలో బన్ని కోసం ఫ్యాన్స్ అసిషియేషన్ కూడా ఏర్పాటు చేశారు. బన్నీ ప్రతి సినిమా ఈవెంట్ కు అక్కడ నుండి ఫ్యాన్స్ వస్తారంటే నమ్మాలి. అందుకే ప్రతి సినిమాను మళయాళ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తాడు అల్లు అర్జున్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: