దేశంలో ఎక్కడ చూసినా లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో ప్రజలు అందరు ఇంటికే పరిమితమైపోతున్న పరిస్థితులలో చాలామంది సోషల్ మీడియాకు విపరీతంగా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ సమ్మర్ లో ఇంటర్నెట్ వినియోగం విద్యుత్ వినియోగం కన్నా ఎక్కువై అనేక సమస్యలు వస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో కూడ టాప్ హీరోల అభిమానులు అసలైన కరోనా సమస్య గురించి పట్టించుకోకుండా తమ అభిమాన హీరోలను హైలెట్ చేస్తూ మిగతా హీరోల పై బురదజల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో గతవారం ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ విడుదల చేసిన వీడియోలోని జూనియర్ వాయస్ ఓవర్ ను ప్రశంసిస్తూ తారక్ అభిమానులు చేస్తున్న హడావిడి మధ్య ఇప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ రావడం పవన్ అభిమానులను కూడ ఆశ్చర్య పరుస్తోంది.


గత సంవత్సరం ‘సైరా’ విడుదల సమయంలో ఆ మూవీ ట్రైలర్ కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయస్ ఓవర్ ను ఇప్పుడు గుర్తుకు చేస్తూ జూనియర్ వాయస్ ఓవర్ ముందు పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ కూడ ఏమాత్రం సరిపోదు అంటూ జూనియర్ అభిమానులు పవన్ అభిమానులను రెచ్చగొడుతున్నారు. దీనితో ఇప్పటి వరకు అల్లు అర్జున్ అభిమానులతో అసహనాన్ని కొనసాగిస్తున్న పవన్ అభిమానులు లేటెస్ట్ గా జూనియర్ అభిమానుల కామెంట్స్ తో వారి పై కూడ మండిపడుతున్నారు. 


వాస్తవానికి ఒక హీరో నటనకు మరొక హీరో నటనకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరి శైలి వారిది. ఈ చిన్న విషయాన్ని కూడ పట్టించుకోకుండా ఇప్పుడు అనవసరంగా తారక్ అభిమానులు పవన్ అభిమానులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ టాప్ హీరోల అభిమానుల మధ్య పెరిగిపోతున్న వార్ పై ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: