ప్రభాస్ చేసే అతిథి మర్యాదలు తట్టుకోవడం కష్టం అని చాలామంది అంటూ ఉంటారు. అలాగే ప్రభాస్ ఉదారత ముందు ఏ టాప్ హీరో సరి తూగడు అంటూ ఇప్పుడు అతడి ఫ్యాన్స్ ఒక సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కరోనా సేవా కార్యక్రమాల కోసం నాలుగు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు చిరంజీవి స్థాపించిన కరోనా క్రైసిస్ ఛారిటీ కి ఏ టాప్ యంగ్ హీరో ఇవ్వని విధంగా 50 లక్షల విరాళాన్ని ప్రకటించి ఉదారతలో కూడ తమ హీరో నిజమైన ‘బాహుబలి’ అంటూ ప్రభాస్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


4.50 కోట్లు విరాళం ఇవ్వడం సాధారణమైన విషయం కాదని ప్రభాస్ అభిమానులు ప్రశంసలతో సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన సిసిసి సంస్థకు విరాళాలు బాగానే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ సిసిసి కమిటీలో చిరంజీవి తన మాటకు విలువ ఇచ్చే మనషులతోనే నింపేసాడు అంటూ మరికొందరు అప్పుడే నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. 


ఈ కమిటీలోని ఒక కీలక వ్యక్తి థియేటర్ల స్టాఫ్ కూడా టాలీవుడ్ లో భాగమే కనుక వాళ్లను కూడా అందులో చేర్చాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేయడం వలన తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో థియేటర్లు భారీగా లీజ్ తీసుకున్నవారికి కాస్త ఊరట కలిగి ఇక వారు తమ ధియేటర్స్ స్టాఫ్ కు వేరుగా సహాయం చేయకుండా సిసిసి తోనే సహాయం చేయించాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 


ఇప్పుడు సిసిసి ద్వారా చిరంజీవి నేతృత్వంలో జరగబోతున్న సేవా కార్యక్రమాల విషయమై కొందరు మరొక విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ధియేటర్లలో అదనపు షోలు వేసుకోవడం టిక్కెట్లు రెట్లు పెంచుకోవడం లాంటి విషయాలలో ప్రతి విషయంలో ప్రభుత్వాల సహాయ సహకారాల పై ఆధారపడే ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు తమ విరాళాలను పూర్తిగా ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఇవ్వకుండా ఫిలిం ఇండస్ట్రీ తనకు తానుగానే ఒక ప్రత్యేకమైన కమిటీలు వేసుకోవడం ఏమిటి అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నట్లు టాక్. కరోనా వచ్చి టాలీవుడ్ వ్యవహారాలను కూడా ఒక కుదుపు కుదుపుతోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్న పరిస్థితులలో ఇండస్ట్రీలోని రాజకీయాలు మరొకసారి బయటపడుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: