దేశమంతటా కరోనా కర్ఫ్యూ నెలకొన్న తరుణంలో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఒకలాంటి నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవం. అయితే ఆ నైరాశ్యాన్ని తొలగించడానికా అన్నట్టు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసాడు. మనం ఊహించినదానికంటే అద్భుతంగా మోషన్ పోస్టని డిజైన్ చేసి అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు. కొమరం భీమ్, రాం చరణ్ లని నిప్పు నీరుగా అభివర్ణించిన రాజమౌళి నిప్పుకణిక అల్లూరి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. 

 


ఈ లుక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్..నాలుగు భాషల్లో ఆయన డబ్బింగ్ చెప్పిన తీరు.. అంతా అంతా బానే ఉంది. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అనేక ప్రశ్నలు చెలరేగాయి. రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తున్న రాజమౌళి పోలీస్ డ్రెస్ లో ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. అదీ గాక ఆర్.ఆర్.ఆర్ లో రాజమౌళి చూపించిన సీతారామరాజు లుక్ కి మనకు తెలిసిన సీతారామరాజు లుక్ కి చాలా తేడాలున్నాయి. 

 

రామ్ చరణ్ లాగే ఎన్టీఆర్ లుక్ కూడా ఇదే విధంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో చరిత్రకారులు కానీ, లేదా కొమరం భీమ్, అల్లూరి ప్రాంతాలకి చెందిన వారు గానీ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సమస్యతో ముందుకు రావచ్చు. మరి ఈ సమస్యని రాజమౌళి ఎలా ఎదుర్కొంటాడో.. అయితే అలా ముందుకొచ్చే వారు ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి.

 

రాజమౌళి చెప్పినట్టు ఇది కల్పిత కథ.. అలాగే 1920 ప్రాంతంలో అసలేం జరిగిందన్నదానికి రుజువులు కూడా లేవు. కాబట్టి వారు వాదించడానికి కూడా ఉండదు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. రాజమౌళి వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మన తెలుగు హీరోలపై సినిమా తీస్తున్నాడంటే అది మనకు గౌరవం తెచ్చే విధంగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. అదీ గాక వారిద్దరినీ హీరోలుగా చుపిస్తున్నాడంటే ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలిసి కూడా మనోభావాల గురించి మాట్లాడే వారు ఖచ్చితంగా డబ్బు కోసమే తప్ప మరో ఉద్దేశ్యం లేదని అర్థం చేసుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: