కరోనా దెబ్బకు చిన్నా పెద్ద అనే తేడాలేకుండా అన్ని వ్యాపారాలు మూతపడ్దాయి.. ప్రపంచం మొత్తం నిస్తేజంగా మారింది.. రానున్న రోజుల్లో ఆర్ధిక విపత్తు ముంచుకొస్తుందన్న విషయం తెలిసిందే.. ఇకపోతే అసలు కరోనా పుట్టిల్లు చైనాలో నెలకొన్న పరిస్దితుల గురించి తెలిసిందే.. మొదటి సారిగా చైనా నగరంలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న కరోనా అన్ని దేశాలను అత్తవారి ఇల్లులా మార్చేసుకుంది.. ఒక్క చోట స్దిరంగా ఉండలేక ప్రపంచాన్నే నిశబ్ధంగా మార్చేసింది.. దీని దాడికి ప్రతి రంగం కుదేలైంది.. అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి..

 

 

ఇక సినిమాలు విడుదల కాక.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో వేలది మంది కళాకారులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సినీ కార్మికుల ఆకలి కేకలతో ఇండస్ట్రీ క్షీణదశలో ఉంది. ఇలా లెక్కిస్తే ఊహకందనంత నష్టం.. అంతెందుకు ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సుమారు.. రూ. 2000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. ఇదిలా ఉండగా కరోనాను కన్నతల్లి చైనా దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగౌతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో కూడా సినిమా ఇండస్ట్రీ‌కి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చూ.. విడుదలకు సిద్దమైనా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అందువల్ల సినిమా పరిశ్రమ అక్కడ కూడా నష్టాల్లో మునిగింది.. ఇక చైనాలో పరిస్థితులు కాస్త మెరుగు కావడంతో తిరిగి థియేటర్స్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం..

 

 

ఇందుకు గాను సినిమా పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సిటింగ్‌లో కనీసం మూడు అడుగుల దూరం పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ ఆచరణను చైనాలోని షాంఘై నగరంలో శనివారం నుంచి ప్రారంభిస్తున్నారు.. ఈ క్రమంలో సుమారు 200 థియేటర్స్‌ తిరిగి ఓపెన్ కానున్నాయి. ఇకపోతే ఇటీవల విడుదలైన సినిమాలు కరోనా ఎఫెక్ట్‌తో రెండు మూడు రోజుల మాత్రమే ప్రదర్శితం అయ్యాయి. కాబట్టి తిరిగి వాటినే రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదేగాక చైనా త్వరలో కొత్త సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ కూడా చేస్తుందట..

మరింత సమాచారం తెలుసుకోండి: